Symbol : మనలో ప్రతి ఒక్కరికీ వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మన అర చేతి రేఖలను చూసి భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకునే మార్గం కూడా ఒకటి. పండితులు మన చేతి రేఖలను చూసి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.. అనే విషయాలను తెలియజేస్తారు. ఒకవేళ అర చేతుల రేఖల మధ్య ఇంగ్లిష్ అక్షరం ఎక్స్ (X) ఆకారంలో గుర్తు ఉన్నట్టయితే అలాంటి వారికి తిరుగు ఉండదట. అరచేతుల రేఖల మధ్య ఎక్స్ ఆకారంలో గుర్తు చాలా తక్కువ మందిలో ఉంటుందట. అరచేతిలో రేఖల మధ్య ఎక్స్ ఆకారంలో గుర్తు ఉన్నట్టయితే కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అర చేతిలో ఎక్స్ ఆకారం గుర్తు కలిగిన వారు అత్యంత ప్రతిభావంతులై ఉంటారట. వారు విజయపథంలో నడవడమే కాకుండా ఇతరులను కూడా విజయ పథంలో నడిపిస్తారు. అర చేతిలో రేఖల మధ్య ఎక్స్ ఆకారం గుర్తు కలిగిన వారు ప్రపంచాన్నే జయిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ కు కూడా ఇలాగే అర చేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండేదని చరిత్ర తెలియజేస్తోంది. అనేక మంది చేతి రేఖలపై మాస్కోలోని హెచ్‌టీఐ యూనివర్సిటికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు, అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్ కు కూడా ఈ విధంగానే అర చేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండేదని వారు తెలియజేశారు.
శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం రెండు అర చేతుల్లో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉన్నట్టయితే వారు బలవంతులుగా ఉండడంతోపాటు ఎటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు సాగి ఆ పనిని విజయవంతం చేయగలుగుతారట. అర చేతుల్లో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉన్నవారు విజయాల కోసం ప్రయత్నించక పోయినా విజయాలు వారి వెంట ఉంటాయట. ఇలాంటి వారు ఇతర వ్యక్తులను సులువుగా అంచనా వేయగలరట.
వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టమేనట. వీరికి ఎలాంటి హాని తలపెట్టాలని చూసినా అది విఫలమే అవుతుందట. అర చేతుల్లో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉన్న వారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా శక్తివంతులుగా ఉంటారట. వీరు తమతోపాటు ఇతరుల జీవితాల్లో కూడా మార్పు తేగలరని సదరు పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఇలాంటి వారు ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చుకోగలరని, సమాజంలో వీరికి ఎంతో గౌరవం ఉంటుందని.. పరిశోధకులు తెలియజేస్తున్నారు.