Fingers : మన భవిష్యత్తును చేతి వేళ్లను చూసి కూడా తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. స్త్రీ మరియు పురుషుడి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా చేతి వేళ్లను చూసి చెప్పవచ్చని వారంటున్నారు. మన చేతికి ఉన్న మూడు వేళ్ల ద్వారా మన జాతకాన్ని చెప్పవచ్చు. అవే చూపుడు వేల, మధ్య వేలు, ఉంగరం వేలు. వీటి పొడవులోని తేడాల ద్వారా మనిషి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఒక అంచనా వేయవచ్చు. బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన వారికి ఉంగరం వేలు పొడవుగా ఉంది. ఉంగరం వేలు కంటే చూపుడు వేలు పొడవుగా ఉన్న వారు బాగా ధనవంతులు అవుతారు. చేతి వేళ్ల గురించి శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో చూపుడు వేలికి, ఉంగరం వేలికి గర్భంలో ఉన్నప్పుడే లింక్ ఏర్పడుతుంది.
పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ కు చేతి వేళ్ల పొడవుకు సంబంధం ఉంటుంది. దాని ప్రకారం పురుషులకు ఉంగరం వేలు పొడవుగా ఉంటుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే వారికి చూపుడు వేలు పొడవుగా ఉంటుంది. టెస్టోస్టిరాన్ ఎంత ఎక్కువగా ఉంటే ఉంగరం వేలు అంత పొడవుగా ఉంటుంది. ఇలా పొడవైన వేళ్లు ఉంటే క్యాస్నవాబ్ ప్యాటర్స్ అని అంటారు. గర్భంలో మన భవిష్యత్తుకు బీజం పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చూపుడు వేలు కంటేఉంగరం వేలు పొడవుగా ఉంటే వారు బలంగా ఉంటారు. మామూలుగానే ఉంగరం వేలు పొడవుగా ఉంటుంది. సాధారణం కంటే కూడా ఉంగరం వేలు పొడవుగా ఉంటే వారు చాలా ధృడంగా ఉంటారు. వీరు ఆటల్లో రాణిస్తారు. అలాగే వారు ఆలోచనలు కూడా చాలా వేగంగా ఉంటాయి.
వీరికి కష్టపడితేనే ఏదైనా దొరుకుతుంది. వీరు తెలివైన వారైనా ప్రతి దానికి కష్టపడి సంపాదించుకోవాలి. అదృష్టం తక్కువగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు అనుకున్నది మాత్రం సాధిస్తారు. ఇక ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు పొడవుగా ఉంటే వారు కాస్త తెలివిగా ఉంటారు. ఇలా స్త్రీలల్లో ఎక్కువగా ఉంటుంది. చూపుడు వేలు సాధారణం కంటే ఎక్కువ పొడవు ఉంటే వీళ్లు ఎక్కువగా డామినేట్ చేస్తారు. పురుషులకు గనుక పొడవైన చూపుడు వేలు ఉంటే వారు చాలా అదృష్టవంతులు. చదువులో ముందుంటారు. వ్యాపారంలో రాణిస్తారు. అశ్రద్ధ గా ఉన్నా సరైన దారిలోనే వెళ్తారు. అలాగే పురుషుల కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు పై ఉండే మూడు గీతల్లో పై గీత కంటే పైకి ఉంటే వీరు ఎన్నో ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు. వీళ్లు రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు. వీరి వల్ల పక్క వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయి.
అలాగే ఉంగరం వేలు మధ్యవేలు పై గీత కంటే చిన్నగా ఉంటే వాళ్లకు జీవితం అంత సులభంగా ఉండదు. ఏం చేయాలో, ఏం కావాలో అర్థం కాదు. తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిసారి నష్టపోతుంటారు. కానీ పక్క వాళ్లకి కష్టం వచ్చిన ఆదుకుంటారు. 30 ఏళ్ల తరువాత కానీ వీరు ఒకదారిలో పడరు. ఇక మధ్య వేలు పై గీతకు సరిగ్గా ఉంగరం వేలు గీత ఉంటే వాళ్లు మహా అదృష్టవంతులు. వీళ్లకు జీవితం మీద మంచి ఆశ ఉంటుంది. చాలా త్వరగా స్థిర పడతారు. పెళ్లి విషయంలో కూడా చాలా ముందుంటారు. వీరికి ధన రేఖ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కుటుంబంతో అంత సఖ్యత ఉండదు. డబ్బు ఉన్నా కూడా సంతోషం ఉండదని శాస్త్రవేత్తలు వారి పరిశోధనల్లో తేల్చారు. ఈ విధంగా మన చేతి మూడు వేళ్లను బట్టి మన జాతకాలను అంచనా వేయవచ్చు.