సాధారణంగా ఏ రంగంలోనైనా మన ఇండియన్స్ కొంతలో కొంత వరకైనా అదృష్టం అనేది నమ్ముకుంటు వస్తారు. ఇందులో ముఖ్యంగా భారత క్రికెటర్లు మైదానంలో అడుగుపెట్టే ముందు కొన్ని వస్తువులను లక్ గా భావిస్తారట..వారి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాటిని ఫాలో అవుతూనే ఉన్నారట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వెటరన్ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ కు రెడ్ హ్యాండ్ కర్చీఫ్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉండేదట. ఆయన మైదానంలో అడుగుపెట్టాలంటే ఎర్రటి రుమాల్ ఉండాల్సిందే. ఇండియన్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తన మెడలో ఎప్పుడు నల్లటి టాలిస్మాన్ ధరించేవాడు. బ్యాటింగ్ సమయంలో దాన్ని అతని జెర్సీ కి వేలాడదీసేవాడు.
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ తన జేబులో ఎప్పుడూ తన గురువు ఫోటో పెట్టుకునేవారు. అలాగే దండలు ఉంగరాలు కూడా ధరించేవాడు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా థాయ్ ప్యాడ్ ను కుడికాలుకు ముందుగా కట్టుకునే వాడు. జహీర్ ఖాన్ కూడా లక్కీ హ్యాండ్ కర్చీఫ్ లు నమ్ముకునేవాడు. ప్రతి మ్యాచ్లో పసుపు రంగు రుమాలు ధరించేవాడు. భారత పాపులర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నెంబర్ లేని జెర్సీని ధరించడం అదృష్టంగా భావించేవారు.
క్రికెట్ దేవుడు గా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ తన ఎడమ పాదానికి ముందుగా ప్యాడ్ ధరిస్తాడట. రోహిత్ శర్మ: ఈ దిగ్గజ క్రికెటర్ కూడా మ్యాచ్ ఆడే ముందు తప్పనిసరిగా కాఫీ తాగుతారట. అలాగే బ్యాటింగ్ చేయడానికి వచ్చేముందు గ్రౌండ్ లో కుడిపాదం పెడతారట.