Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

IPL Auction 2022 : ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. 10 జట్ల‌కు చెందిన పూర్తి ప్లేయ‌ర్ల జాబితా ఇదే..!

Editor by Editor
February 14, 2022
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

IPL Auction 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ వేలంలో ప్లేయ‌ర్ల‌ను టీమ్‌లు పోటీలు ప‌డి మ‌రీ కొనుగోలు చేశాయి. ఈ క్ర‌మంలోనే వచ్చే ఐపీఎల్ సీజ‌న్ మ‌హా ఆస‌క్తిగా ఉంటుంద‌ని తెలుస్తోంది. మొత్తం 10 టీమ్‌లు 204 మంది ప్లేయర్ల‌ను కొనుగోలు చేయ‌గా.. అందుకు గాను ఫ్రాంచైజీలు మొత్తం రూ.551.70 కోట్ల‌ను ఖ‌ర్చు చేశాయి.

IPL Auction 2022 full list of players from all 10 teams after auction
IPL Auction 2022

ఇటీవ‌లే జ‌రిగిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్‌లో భార‌త జ‌ట్టులో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన కెప్టెన్ య‌ష్ ధుల్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. అలాగే ఆల్ రౌండ‌ర్ రాజ్ బావాను, రాజ‌వ‌ర్ధ‌న్‌ను పంజాబ్‌, చెన్నైలు కొనుగోలు చేశాయి. ఇక వేలం అనంత‌రం 10 ఐపీఎల్ జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్ల పూర్తి జాబితా వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ముంబై ఇండియ‌న్స్‌..

రోహిత్ శ‌ర్మ‌, కిర‌న్ పొల్లార్డ్‌, జ‌స్‌ప్రిత్ బుమ్రా, సూర్య కుమార్ యాద‌వ్‌ల‌ను ఈ టీమ్ రిటెయిన్ చేసుకుంది. వేలంలో ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, ఎన్.తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్, టిమ్ డేవిడ్, రిలే మెరెడిత్, మహ్మద్ అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ఆర్యన్ జుయల్, ఫాబియన్ అలెన్ ల‌ను కొనుగోలు చేసింది.

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌..

ఈ జ‌ట్టు ఆండ్రూ ర‌స్సెల్‌, సునీల్ న‌రైన్‌, వెంక‌టేష్ అయ్య‌ర్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిల‌ను రిటెయిన్ చేసుకుంది. అలాగే పాట్ కమిన్స్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, షెల్డన్ జాక్సన్, అజింక్యా రహానే, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, రసిఖ్ దార్, బాబా ఇంద్రజిత్, చమిక కరుణరత్నే, అభిజీత్ తోమర్, ప్రథమ్ సింగ్, అశోక్ శర్మ, సామ్ బిల్లింగ్స్, అలెక్స్ హేల్స్, టి సౌత్ హేల్స్, రమేష్ కుమార్, మహ్మద్ నబీ, ఉమేష్ యాదవ్, అమన్ ఖాన్.. ల‌ను వేలంలో కొనుగోలు చేసింది.

గుజ‌రాత్ టైటాన్స్‌..

ఈ జ‌ట్టు శుబ‌మ‌న్ గిల్‌, హార్దిక్ పాండ్యా, ర‌షీద్ ఖాన్ ల‌ను రిటెయిన్ చేసుకుంది. అలాగే జాసన్ రాయ్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదారంగని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, ఆర్.సాయి కిషోర్, డొమినిక్ డ్రేక్స్, జయంత్ యాదవ్, విజయ్ శంకర్, దర్శన్ నల్కండే, యష్ దయాల్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా వాడే, గురుకీరత్ సింగ్ ల‌ను వేలంలో కొనుగోలు చేసింది.

చెన్నై సూప‌ర్ కింగ్స్‌..

రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ల‌ను ఈ జ‌ట్టు రిటెయిన్ చేసుకుంది. అలాగే రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రేవో, అంబటి రాయుడు, దీపక్ చాహర్, కేఎమ్ ఆసిఫ్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, మహేశ్ తీక్షణ, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, సిమర్‌జీత్ సింగ్, డెవాన్ కాన్వే, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, సుభ్రాంషు చోదన్‌పతి, ముష్రాన్‌కి ప్రశేనాపతి, సి.హరి నిశాంత్, ఎన్ జగదీశ‌న్, క్రిస్ జోర్డాన్, కె.భగత్ వర్మ.. ల‌ను కొనుగోలు చేసింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..

ఈ జ‌ట్టు రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే ల‌ను రిటెయిన్ చేసుకుంది. డేవిడ్ వార్నర్, మిచ్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, కమలేష్ నాగర్‌కోటి, కేఎస్ భరత్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్, సయ్యద్ ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రిపాల్ పటేల్, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, దూబే, లుంగిసాని ఎంగిడి, టిమ్ సీఫెర్ట్, విక్కీ ఓస్ట్వాల్ ల‌ను కొనుగోలు చేసింది.

లక్నో సూప‌ర్ జియాంట్స్..

కేఎల్ రాహుల్‌, ర‌వి బిష్ణోయ్‌, మార్క‌స్ స్టాయినిస్‌ల‌ను ఈ టీమ్ రిటెయిన్ చేసుకుంది. క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, జాసన్ హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, అంకిత్ రాజ్‌పూత్, కె.గౌతమ్, దుష్మంత చమీర, షాబాజ్ నదీమ్, మనన్ వోహ్రా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీ, కైల్ శర్మ, కరణ్ మ‌యర్స్, కరణ్ శర్మ లూయిస్, మయాంక్ యాదవ్ ల‌ను కొనుగోలు చేసింది.

పంజాబ్ కింగ్స్‌..

మ‌యాంక్ అగ‌ర్వాల్‌, అర్ష‌దీప్ సింగ్‌ల‌ను రిటెయిన్ చేసుకుంది. శిఖర్ ధావన్, కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, ఇషాన్ పోరెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్, సందీప్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, ప్రేరక్ మన్కడ్, వైభవ్ ఎ చరోటర్, వైభవ్ ఎ., బల్తేజ్ ధండా, అన్ష్ పటేల్, నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, భానుకా రాజపక్సే, బెన్నీ హోవెల్ ల‌ను కొనుగోలు చేసింది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌..

సంజు శాంస‌న్‌, య‌శ‌స్వి జైశ్వాల్‌, జాస్ బ‌ట్ల‌ర్‌ల‌ను ఈ టీమ్ రిటెయిన్ చేసుకుంది. ఆర్.అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కేసీ కరియప్ప, నవదీప్ సైనీ, ఒబెద్ మెక్‌కాయ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, తేజస్ బరోకా, ఎస్.వల్దీప్ యాదవ్ గర్వ్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డారిల్ మిచెల్ ల‌ను కొనుగోలు చేసింది.

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..

విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ ల‌ను రిటెయిన్ చేసుకుంది. ఫాఫ్ డు ప్లెసిస్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, షాబాజ్ అహ్మ‌ద్, ఆకాష్ దీప్, జోష్ హేజ‌ల్‌వుడ్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రెండోర్ఫ్, సుయాష్ ప్రభుదేశాయి, సిద్ధర్న్ శరత్మ గౌతంసాయి, యాన్ కర్త్ మిగౌద్‌సాయి, కౌల్, లువ్నిత్ సిసోడియా, డేవిడ్ విల్లీ ల‌ను కొనుగోలు చేసింది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..

కేన్ విలియ‌మ్స‌న్‌, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ స‌మ‌ద్‌ల‌ను రిటెయిన్ చేసుకుంది. వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీష సుచిత్, ఐడెన్ మర్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, ఆర్. సింగ్ సమర్థ్, సతురబ్షాన్, సమర్త్, ఫజల్హాక్ ఫారూఖీ, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్ ల‌ను వేలంలో కొనుగోలు చేసింది.

IPL Auction 2022 : జ‌ట్ల వ‌ద్ద ఉన్న ప్లేయ‌ర్ల సంఖ్య‌..

చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో మొత్తం 25 మంది ప్లేయ‌ర్లు ఉండ‌గా.. వీరిలో 8 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. వేలం ముగిసిన త‌రువాత చెన్నై వ‌ద్ద ఇంకా రూ.2.95 కోట్లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ టీమ్ 24 మంది ప్లేయ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌గా వారిలో 7 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. వేలం అనంత‌రం ఈ జ‌ట్టు వ‌ల్ల రూ.10 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉన్నాయి. కోల్‌క‌తా టీమ్‌లో 25 మంది ప్లేయ‌ర్లు ఉండ‌గా, వారిలో 8 మంది విదేశీయులు ఉన్నారు. వేలం ముగిశాక జ‌ట్టు వ‌ద్ద రూ.45 ల‌క్ష‌లు మిగిలాయి.

ముంబై జ‌ట్టులో 25 మంది ప్లేయ‌ర్లు ఉన్నారు. వీరిలో 8 మంది విదేశీ ప్లేయ‌ర్లు. వేలం ముగిశాక జ‌ట్టు చేతిలో రూ.10 ల‌క్ష‌లు ఉన్నాయి. పంజాబ్ వ‌ద్ద 25 మంది ప్లేయ‌ర్లు ఉండ‌గా, వీరిలో 7 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. ఇంకా రూ.3.45 కోట్లు ఉన్నాయి. రాజ‌స్థాన్ వ‌ద్ద 24 మంది ప్లేయ‌ర్లు ఉన్నారు. వారిలో 8 మంది విదేశీ ప్లేయ‌ర్లు కాగా జ‌ట్టు వ‌ద్ద ఇంకా రూ.95 ల‌క్ష‌లు ఉన్నాయి.

అలాగే బెంగ‌ళూరు టీమ్ లో 22 మంది ప్లేయర్లు ఉండగా వీరిలో 8 మంది విదేశీ ప్లేయ‌ర్లు న్నారు. రూ.1.55 కోట్లు ఉన్నాయి. హైద‌రాబాద్ వ‌ద్ద రూ.10 ల‌క్ష‌లు ఉండ‌గా, 23 మంది ప్లేయ‌ర్లు, వారిలో 8 మంది విదేశీయులు ఉన్నారు. ల‌క్నో వ‌ద్ద 21 మంది ప్లేయ‌ర్లు, వారిలో 7 మంది విదేశీయులు ఉన్నారు. చేతిలో ఏమీ లేవు. అంతా ఖ‌ర్చు చేశారు. గుజ‌రాత్ వ‌ద్ద 23 మంది ప్లేయ‌ర్లు ఉన్నారు. వీరిలో 8 మంది విదేశీ ప్లేయ‌ర్లు. జ‌ట్టు వ‌ద్ద ఇంకా రూ.15 ల‌క్ష‌లు ఉన్నాయి.

Tags: Indian Premiere LeagueIPLIPL 2022IPL 2022 Auctionఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ఐపీఎల్‌ఐపీఎల్ 2022ఐపీఎల్ 2022 వేలం
Previous Post

Shilpa Shetty : శిల్పా శెట్టికి కొత్త క‌ష్టాలు.. ఈసారి త‌ల్లి, చెల్లి కూడా..!

Next Post

Betel Nut Leaves : త‌మ‌ల‌పాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా ? రోజూ రెండు ఆకుల‌ను తినండి చాలు.!

Related Posts

ఆధ్యాత్మికం

ఆల‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కూడ‌దు.. ఎందుకంటే..?

July 8, 2025
ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలోకి మ‌హిళ‌లు అందుక‌నే వెళ్ల‌కూడ‌దు.. వెళ్తే ఏం జ‌రుగుతుంది అంటే..?

July 8, 2025
ఆధ్యాత్మికం

జామ పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఏం జ‌రుగుతుంది..?

July 8, 2025
వినోదం

పుష్ప మూవీ.. ఈ ఒక్క సీన్ లో ఇంత అర్థం ఉందా !

July 8, 2025
ఆధ్యాత్మికం

ఆదివారం మాంసాహారం తింటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా ?

July 8, 2025
వినోదం

మాయాబజార్ లో ప్లేట్లో ఉన్న లడ్డూలు గాల్లోకి ఎలా ఎగురుతాయో మీకు తెలుసా..?

July 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.