టీమ్ ఇండియా స్టార్ బౌలర్ హైదరాబాద్ ఆటగాడు అయిన మహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ DGP జితేందర్ సిరాజ్ కి నియామక పత్రాన్ని ఇచ్చారు. సిరాజ్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీం లో సభ్యుడిగా ఉన్న సిరాజ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ఇచ్చారు. సిరాజ్ కి DSP ఉద్యోగంతో పాటుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78 లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. తనకి ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సిరాజ్ 2017 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. టీమిండియా ప్లేయర్ గా కొనసాగుతున్నారు. T20 వరల్డ్ కప్ 2024 తో పాటుగా దాని కంటే ముందు జరిగిన ఆసియా కప్ లో కూడా అద్భుతంగా రాణించారు. సిరాజ్ తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలని చేశారు. ఇప్ప టివరకు సిరాజ్ 28 టెస్ట్లు, 44 వన్డేలు, 16 T20లు ఆడారు. 161 వికెట్లను పడగొట్టారు.