Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

Admin by Admin
June 1, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

క్రికెట్ ఆటగాళ్ళు క్రికెట్ ఆడే సమయంలో ముఖాలపై తెల్లటి పౌడర్ పూసుకోవడం మనందరం చూసే ఉంటాం.. కానీ ఎందుకు పూసుకుంటారు అనే విషయం చాలామందికి తెలియదు..దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్రికెటర్లు ముఖంపై పూసుకునే పౌడర్ ని జింక్ ఆక్సైడ్ అంటారు. ఇది చర్మం పైన ఉండే భౌతిక సన్‌స్క్రీన్, లేదా రిఫ్లెక్టర్ అని పిలుస్తారు. ఇది సూర్యుని యొక్క హానికరమైన uv, uvb కిరణాలు చర్మం నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆట ఆడే టైంలో 6 గంటలు క్రికెటర్లు నేరుగా సూర్యుడి వేడికి గురవుతారు. కాబట్టి వారు జింక్ ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. అలాగే టెస్ట్ మ్యాచ్‌లో ఆడే సమయంలో 5 రోజులు ఎండలో ఆడటం అంత సులువైన పని కాదు.

కాబట్టి ఆటగాళ్లు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సేపు సూర్యరశ్మికి గురి కావడం ప్రమాదకరం, జింక్ ఆక్సైడ్ వంటి ఫిజికల్ సన్‌స్క్రీన్‌తో మీ చర్మాన్ని రక్షించుకోవడం అనేది సురక్షితమైన పద్ధతి. జింక్ క్రీమ్‌లు, తెల్ల రంగులో ఉన్నవి ప్రభావవంతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పౌడర్ యొక్క మందపాటి పూత అన్ని UVA UVB కిరణాలను ఫిల్టర్ చేస్తుంది. చెవి, ముక్కు, రక్షించడానికి ఉపయోగపడుతుంది. సాంప్రదాయ రసాయన సన్‌స్క్రీన్‌లతో పోల్చినప్పుడు జింక్ ఆక్సైడ్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

why cricketers use this kind of powder when in matches

జింక్ ఆక్సైడ్ వెంటనే పని చేస్తుంది.కానీ కొన్ని రసాయన సన్‌స్క్రీన్‌లు ఎండలో బయటికి వెళ్లే ముందు ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 నిమిషాలు వేచి ఉండాలని సూచిస్తున్నాయి. ఇది చాలా సున్నితమైన చర్మానికి కూడా తగినంత సున్నితంగా ఉంటుంది. రసాయన సన్‌స్క్రీన్‌లు, మరోవైపు, చర్మానికి ఇబ్బంది కలిగించవచ్చు. జింక్ ఆక్సైడ్ పొడి చర్మానికి చికాకు ఇతర ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. అందుకే క్రికెటర్స్ ముఖానికి ఈ పౌడర్ రాసుకుంటారు.

Tags: cricketerszinc oxide
Previous Post

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

Next Post

ఈ మొక్క‌ను మీరు ఇంట్లో పెట్టుకుంటే చాలు.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

Related Posts

వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025
చిట్కాలు

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!