శుభ‌వార్త‌.. దేశంలో స‌గం మంది పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు..!

క‌రోనా మూడో వేవ్ వ‌స్తుంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త‌ను చెప్పింది. దేశంలో 50 శాతం మంది పెద్ద‌లు పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నార‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 127.61 కోట్ల కోవిడ్ టీకాల‌ను వేశార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. ఈ సంద‌ర్బంగా ఆ శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్‌సుఖ్ మాండ‌వియా మాట్లాడుతూ.. దేశంలోని … Read more

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక చేయికి ఎందుకు నొప్పి క‌లుగుతుందో తెలుసా ?

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ చురుగ్గా టీకాల‌ను వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాను తీసుకున్న అనంత‌రం స‌హ‌జంగానే ఎవ‌రికైనా ప‌లు సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తుంటాయి. కొంద‌రికి జ్వ‌రం వ‌స్తుంది. ఇంకొంద‌రికి వేరే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా వ‌స్తేనే వ్యాక్సిన్ బాగా ప‌నిచేస్తున్న‌ట్లు అర్థం అని నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ వేసిన చేయి స‌హ‌జంగానే వాపుకు గుర‌వుతుంది. ఆ ప్ర‌దేశంలో నొప్పి వ‌స్తుంది. ఇలా … Read more

కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటే సంతాన లోపం స‌మ‌స్య వ‌స్తుందా ?

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం చురుగ్గా కొన‌సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు రోజూ పెద్ద ఎత్తున టీకాల‌ను ఇస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి కేంద్ర‌మే ఉచితంగా టీకాల‌ను అందిస్తోంది. అయితే టీకాల‌ను తీసుకునేవారికి అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. టీకాల‌ను తీసుకోవాలా, వ‌ద్దా అని సందేహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ టీకాల‌ను తీసుకుంటే సంతాన లోపం స‌మ‌స్య వ‌స్తుందేమోన‌ని చాలా మంది భ‌య ప‌డుతున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య … Read more

కోవిడ్ టీకాల‌ను తీసుకున్న వారు రోజూ వ్యాయామం చేయాలి.. ఎందుకంటే..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాల‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు రోజూ త‌గినంత నీటిని తాగాలి. అలాగే త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. అయితే క‌రోనా నేప‌థ్యంలో టీకాల‌ను తీసుకునే వారికి సైంటిస్టులు ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పారు. అదేమిటంటే… సాధార‌ణంగా రోజూ వ్యాయామం చేసేవారికి వ్యాధులు వ‌చ్చేందుకు అవకాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. వారంలో క‌నీసం 5 రోజులు రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా స‌రే డ‌యాబెటిస్‌, … Read more

సంతానోత్ప‌త్తిపై కోవిడ్ టీకా ప్ర‌భావం చూపిస్తుందా ? సందేహాలు, స‌మాధానాలు..!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ స‌వాల్ గా మారింది. ఆ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వ‌స్తోంది. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తినీ పెంచుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులంద‌రూ క‌లిసి క‌రోనా వైర‌స్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాల‌ను అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్లు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ టీకాల‌ను తీసుకోవ‌డంలో అనేక మందికి భ‌యాలు నెల‌కొన్నాయి. అనేక మంది అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డం … Read more