నువ్వులు – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Mon, 04 Apr 2022 09:39:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png నువ్వులు – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Sesame Seeds : దీన్ని రోజుకు ఒక‌టి తినండి చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి.. బోలెడు లాభాలు క‌లుగుతాయి..! https://ayurvedam365.com/health-tips-in-telugu/sesame-seeds-laddu-is-very-beneficial-to-bones-eat-daily-one.html Mon, 04 Apr 2022 09:39:27 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=12248 Sesame Seeds : నువ్వుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. వీటితో తీపి వంట‌కాలు త‌యారు చేస్తారు. అలాగే ప‌చ్చ‌ళ్ల‌లో నువ్వుల పొడిని కూడా వేస్తుంటారు. అయితే నువ్వులు బాగా వేడి అని చాలా మంది తిన‌రు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే.. రోజూ త‌గినంత నీటిని తాగితే నువ్వుల‌ను తిన్నా ఏమీ కాదు. వేడి చేయ‌దు. క‌నుక నువ్వుల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నువ్వుల‌ను తీసుకుంటే మ‌న‌కు అనేక రకాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Sesame Seeds laddu is very beneficial to bones eat daily one
Sesame Seeds

నువ్వుల్లో పాల క‌న్నా 13 రెట్లు అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. క‌నుక ఇది మ‌న ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. 100 గ్రాముల నువ్వుల‌లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పెద్ద‌ల‌కు రోజుకు 450 మిల్లీగ్రాములు, పిల్ల‌ల‌కు 600 మిల్లీగ్రాములు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లుల‌కు రోజుకు 900 మిల్లీగ్రాముల కాల్షియం అవ‌స‌రం. క‌నుక నువ్వుల‌ను రోజూ గుప్పెడు మోతాదులో తింటే చాలు.. మ‌న‌కు కావ‌ల్సిన కాల్షియం మొత్తం ఒకేసారి ల‌భిస్తుంది.

ఇక నువ్వుల‌ను రోజూ ఒక గుప్పెడు మోతాదులో వేయించి తిన‌వ‌చ్చు. లేదా అంతే మోతాదులో పొడిని కూర‌ల‌పై చ‌ల్లుకుని తీసుకోవ‌చ్చు. ఇక ఇలా కూడా తిన‌లేమ‌ని అనుకుంటే.. అందుకు ఇంకో మార్గం ఉంది. అదేమిటంటే.. నువ్వుల‌ను రోజూ తీసుకోవాలంటే.. వాటితో ఉండ‌లు త‌యారు చేసుకోవాలి. నువ్వుల‌ను వేయించి వాటిలో బెల్లం పాకం క‌లిపి ఉండ‌లుగా త‌యారు చేసుకోవాలి. వీటిని రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. మ‌న శ‌రీరానికి కావల్సిన కాల్షియం మొత్తం ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

అయితే నువ్వుల‌ను నేరుగా తినాల‌నుకుంటే వాటిని 7 నుంచి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. దీంతో అవి మెత్త‌గా మారుతాయి. త‌రువాత వాటిని బాగా న‌మిలి తినాలి. వీటిని తినక ముందు, తిన్న త‌రువాత గంట వ‌ర‌కు వేటినీ తీసుకోరాదు. లేదంటే నువ్వులు స‌రిగ్గా జీర్ణం కావు. ఇలా నువ్వుల‌ను తీసుకుంటే చాలా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. వీటితో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. అలాగే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

నువ్వుల‌ను పైన తెలిపిన విధంగా ఎలా తీసుకున్నా స‌రే.. మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌, బీపీ త‌గ్గుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ఫైబ‌ర్ ల‌భిస్తుంది క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ప్ర‌ధానంగా మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. వాపులు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి క‌నుక శ‌క్తి వ‌స్తుంది. నీర‌సం పోతుంది. అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది. కాబ‌ట్టి ఇవ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే.. రోజుకు ఒక నువ్వుల ఉండ‌ను అయినా స‌రే తినాల్సిందే..!

]]>
Health Tips : దీన్ని రోజూ ఒక‌టి తిన్నారంటే చాలు.. అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..! https://ayurvedam365.com/healthy-food-recipes/healthy-food/health-tips-take-this-nuvvula-laddu-daily-one-for-wonderful-benefits.html Sun, 02 Jan 2022 08:33:24 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=8445 Health Tips : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నువ్వుల‌ను ఉపయోగిస్తున్నారు. వీటిని అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. నువ్వుల‌తో త‌యారు చేసే ఏ వంట‌కం అయినా స‌రే రుచిగానే ఉంటుంది. ప్ర‌ధానంగా వీటితో తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తుంటారు.

Health Tips take this nuvvula laddu daily one for wonderful benefits

నువ్వులు, బెల్లం క‌లిపి త‌యారు చేసే ల‌డ్డూల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే.. నువ్వులు, బెల్లంతో త‌యారు చేసిన ల‌డ్డూను రోజుకు ఒక్క‌టి తింటే చాలు.. ఎన్నో ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక్క నువ్వుల ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు 62 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అందువ‌ల్ల వీటిని తింటే బ‌రువు పెరుగుతామ‌న్న భ‌యం చెందాల్సిన ప‌నిలేదు. పైగా ఈ ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల శ‌క్తి లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. చిన్నారుల‌కు పెడితే వారు చ‌దువుల్లో రాణిస్తారు.

2. నువ్వులు, బెల్లం క‌లిపి తయారు చేసిన ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు, గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుంది. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. గుండె సుర‌క్షితంగా ఉంటుంది.

3. నువ్వుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైటో స్టెరాల్స్ అనే సమ్మేళ‌నాలు నువ్వుల్లో అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల రోజూ నువ్వుల ల‌డ్డూ ఒక‌టి తింటే చాలు.. శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బ‌రువు త‌గ్గ‌డం సుల‌భత‌రం అవుతుంది.

4. నువ్వులు, బెల్లంలో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, సెలీనియం, కాప‌ర్‌, జింక్‌, ఐర‌న్‌, విట‌మిన్ బి6, విట‌మిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. తెల్ల ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ల‌పై శ‌రీరం పోరాడుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. నువ్వులు, బెల్లంలో కాల్షియం స‌మృద్ధిగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వుల్లో ఉండే మెగ్నిషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు పరుస్తుంది. దీంతో గ్లూకోజ్ లెవ‌ల్స్ త‌గ్గ‌డ‌మే కాక‌.. హైబీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి నువ్వుల ల‌డ్డూలు ఎంతో మేలు చేస్తాయి.

6. కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ నువ్వుల ల‌డ్డూను తింటుంటే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నువ్వుల్లో ఉండే టైరోసిన్ అనే స‌మ్మేళ‌నం శ‌రీరంలో సెరొటోనిన్ స్థాయిల‌ను పెంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

7. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ ఒక్క నువ్వుల ల‌డ్డూను తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. రోజూ సుఖ విరేచ‌నం అవుతుంది.

8. నువ్వుల ల‌డ్డూను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మంలో తేమ పెరిగి పొడిద‌నం త‌గ్గుతుంది. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోతాయి.

]]>
Sesame Seeds : చలికాలంలో నువ్వులను రోజూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..? https://ayurvedam365.com/health-tips-in-telugu/this-is-why-you-need-to-consume-sesame-seeds-daily-in-this-winter-season.html Fri, 05 Nov 2021 03:18:45 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=7082 Sesame Seeds : వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎంతోమంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టడం మరింత ఎక్కువ అని చెప్పవచ్చు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చాలా మందికి జీర్ణక్రియ సమస్యలతోపాటు జలుబు, దగ్గు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. అయితే చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నువ్వులు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు.

this is why you need to consume Sesame Seeds daily in this winter season

నువ్వులు శరీరంలో వేడిని కలుగజేయడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి దోహదపడుతాయి. అలాగే నువ్వులలో ఐరన్ అధికంగా ఉండడంతో రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు.

నువ్వులలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల తరచూ వీటిని తింటుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నువ్వులలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి మన గుండెని పదికాలాల పాటు పదిలంగా ఉండడానికి కారణం అవుతాయి.

నువ్వులలో ఫైబర్, కాల్షియం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. జీర్ణక్రియ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం అవుతాయి.

చలికాలంలో మనం విపరీతమైన చలిని ఎదుర్కొంటాం. దాన్ని తగ్గించుకోవాలంటే రోజూ నువ్వులను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని గుప్పెడు మోతాదులో తీసుకుని పెనంపై కొద్దిగా వేయించి తింటే ఎంతో మంచిది. తోడుగా బెల్లంతో కలిపి కూడా వీటిని తినవచ్చు. దీంతో మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

]]>
నువ్వులతో ఆరోగ్యం.. ఏయే సమస్యలను తగ్గించుకోవచ్చంటే..? https://ayurvedam365.com/home-remedies-in-telugu/home-remedies-using-sesame-seeds.html Thu, 22 Apr 2021 13:04:37 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=2383 భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిని కూరల్లో వేస్తారు. తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే తరచూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నువ్వులతో నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using sesame seeds

1. నువ్వులు, పెసలను ముద్దగా నూరి పెసరకట్టుతో తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

2. నల్ల నువ్వుల ముద్దకు ఐదో వంతు చక్కెర కలిపి మేకపాలతో తీసుకుంటే రక్తస్రావంతో కూడిన విరేచనాలు తగ్గుతాయి.

3. నువ్వులకు చక్కెర కలిపి ముద్దగా నూరి తీసుకుంటే అతి ఆకలి తగ్గుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది.

4. నువ్వుల ముద్దలో వెన్న కలిపి కొన్ని రోజుల పాటు తింటే రక్తమొలలు తగ్గుతాయి. అలాగే నువ్వుల ముద్దకు నాగకేసరాల చూర్ణం, చక్కెర, వెన్న కలిపి కూడా తీసుకోవచ్చు. దీని వల్ల అర్శ మొలలు తగ్గుతాయి.

5. నలభై నుంచి ఎనభై గ్రాముల నల్ల నువ్వుల ముద్దను చన్నీల్లతో కలిపి ప్రతి రోజే ఉదయం తీసుకుంటూ ఉంటే అర్శమొలలు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది.

6. నువ్వులు, శుద్ధి చేయబడిన జీడిగింజలను కలిపి స్వల్ప మోతాదులో తీసుకుంటే చర్మ వ్యాధులు, మందాగ్ని సమస్యలు తగ్గుతాయి. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి.

7. నువ్వులు, శుద్ధి చేసిన జీడిగింజలు, కరక్కాయలు, బెల్లం సమంగా కలిపి మెత్తగా ముద్దగా నూరి కుంకుడు గింజంత మోతాదులో తీసుకుంటే జ్వరం, రక్తహీనత, దగ్గు, ఉబ్బసం తగ్గుతాయి.

8. నువ్వులను ముద్దగా నూరి ఉండలుగా చేసి పొట్ట భాగం మీద దొర్లించుతూ ప్రయోగిస్తే కడుపునొప్పి ఎంత తీవ్రస్థాయిలో ఉన్నా తగ్గుతుంది.

9. ఏడాదికి మించి పాతబడిన నెయ్యి, నువ్వుల నూనె, ఆవనూనెలను కలిపి శరీరానికి బాహ్యాభ్యంతరంగా వాడాలి. అన్ని రకాల వాత వ్యాధులు తగ్గుతాయి.

10. నువ్వులు, ఇప్ప పువ్వుల ముద్దను వేసి కట్టు కడితే గాయాలు మానుతాయి.

11. నువ్వుల ముద్దలో తేనె కలిపి కట్టులా కడుతుంటే పుండ్లు తగ్గుతాయి.

12. నువ్వుల పిండితో కట్టు కడుతూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అలాగే నువ్వుల ముద్దను కూడా రోజు తీసుకుంటే ఇంకా మెరుగైన ఫలితం కనిపిస్తుంది.

13. నువ్వుల ముద్దను, అతి మధురం చూర్ణాన్ని పాలతో కలిపి మరిగించి ఆ మిశ్రమాన్ని పుక్కిలించాలి. దీని వల్ల దంతాలు దృఢంగా మారుతాయి.

14. నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసి మహిళలు తీసుకుంటే వారిలో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. రుతుక్రమం సరిగ్గా ఉంటుంది.

]]>