పురుషుల ఆరోగ్యం – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Sun, 26 Dec 2021 06:34:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png పురుషుల ఆరోగ్యం – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Male Health : స్పెర్మ్ కౌంట్ (వీర్యకణాల సంఖ్య)ను వృద్ధి చేసే ఆహారాలు.. వీటిని తీసుకుంటే చాలు..! https://ayurvedam365.com/featured/male-health-sperm-count-increasing-foods.html Sun, 26 Dec 2021 06:34:50 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=8126 Male Health : ప్ర‌స్తుత త‌రుణంలో కొంద‌రు జంట‌లు సంతానం లేక నిరాశా నిస్పృహ‌ల‌కు లోన‌వుతున్నారు. అయితే సంతాన‌లోపానికి స్త్రీల‌తోపాటు పురుషులు కూడా కార‌ణ‌మ‌వుతున్నారు. వారిలో వీర్య క‌ణాల సంఖ్య తక్కువ‌గా ఉండ‌డం ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య‌. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు కింద ఇచ్చిన ఆహారాలు దోహ‌ద‌ప‌డతాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా పురుషులు త‌మ వీర్య క‌ణాల సంఖ్య‌ను వృద్ధి చేసుకోవ‌చ్చు. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి. అలాగే కొన్ని ఆహారాల వ‌ల్ల శృంగార సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. మ‌రి పురుషుల ఆరోగ్యానికి సంబంధించి ఉప‌యోగ‌ప‌డే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Male Health sperm count increasing foods

1. రోజూ ఒక‌టి అర‌టి పండును తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అర‌టి పండ్ల‌లో విట‌మిన్లు బి1, ఎ, సిలు ఉంటాయి. ఇవి వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

2. డార్క్ చాక్లెట్, మాంసం, విత్త‌నాలు, న‌ట్స్‌, బచ్చలి కూర, కాయధాన్యాలు, తృణధాన్యాలు, సోయా, చేప‌లు, కోడిగుడ్ల‌లో ఎల్‌-అర్జినైన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుతుంది. అందుక‌ని ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

3. పురుషులు రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినాలి. నేరుగా తిన‌లేక‌పోతే పెనంపై వేయించి రోస్ట్‌లా చేసి తిన‌వ‌చ్చు. లేదా తేనెలో క‌లిపి తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల పురుషుల్లో జ‌న‌నావ‌య‌వాల‌కు ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్య క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి.

4. వీర్య కణాల సంఖ్య‌ను పెంచేందుకు దానిమ్మ పండు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని రోజుకు ఒకటి తినాలి. లేదా ఒక గ్లాస్ దానిమ్మ పండు జ్యూస్‌ను రోజూ తాగాలి. దానిమ్మ పండ్ల‌లో ఉండే ఎండీఏ అనే స‌మ్మేళ‌నం వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుతుంది.

5. పాల‌కూర‌లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేందుకు స‌హ‌క‌రిస్తుంది. క‌నుక పురుషులు పాల‌కూర‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

6. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ఉంటుంది. వీర్యం ఎక్కువ‌గా త‌యార‌య్యేందుకు విట‌మిన్ ఎ స‌హాయ ప‌డ‌తుంది. క‌నుక రోజూ ఒక క్యారెట్‌ను తినాలి. లేదా ఒక క‌ప్పు క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. దీంతో వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు.

7. వాల్ న‌ట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవ‌చ్చు.

8. ఇవే కాకుండా ముదురు ఆకుపచ్చ కూరలు, అవకాడోలు, తృణధాన్యాలు, స్ట్రాబెర్రీలు, నిమ్మ, మోసంబి, టమోటాలు, కివీ పండ్లు, వెన్న, గుడ్లు, పాలు, మీగడ, బచ్చలి కూర, జింక్ అధికంగా ఉండే నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, అల్లం, గోధుమ గడ్డి, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ‌ గింజలు, సెలీనియం ఉండే మ‌టన్ లివ‌ర్‌, చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది.

ఇక వీర్య క‌ణాల సంఖ్య పెర‌గాలంటే రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు పౌష్టికాహారం తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గించుకోవాలి. కంప్యూట‌ర్ల ఎదుట ప‌నిచేసేవారు మ‌ధ్య మ‌ధ్య‌లో విరామం ఇవ్వాలి. సెల్‌ఫోన్లు, కంప్యూట‌ర్ల వాడ‌కాన్ని త‌గ్గించాలి. ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో వీలైనంత ఎక్కువ సేపు గ‌డ‌పాలి.

మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వ‌ల్ల కూడా స్పెర్మ్ కౌంట్ త‌గ్గుతుంది. క‌నుక ఆ అల‌వాట్ల‌ను మానేయాలి. ఇక‌ ఆపిల్, బెర్రీస్, పియర్స్, ద్రాక్ష‌, ఖ‌ర్జూరాలు, జామ, మామిడి, పైనాపిల్ వంటి పండ్ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. రోజూ త‌గినంత నీటిని తాగాలి. క‌నీసం 6-8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. ఇన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ ఆయా ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు.

]]>
పురుషులు తమ సమస్యలకు సోంపు గింజల నీళ్లను ఇలా తీసుకోవాలి..! https://ayurvedam365.com/health-tips-in-telugu/take-fennel-seeds-with-water-in-this-way-for-mens-problems.html Thu, 07 Oct 2021 14:01:35 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=6491 వైవాహిక జీవితంలో లైంగిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఒత్తిడి, చెడు జీవనశైలి, ధూమపానం మొదలైన వాటి కారణంగా పురుషుల లైంగిక ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కానీ పురుషులు తమ శృంగార జీవితంలో వచ్చే సమస్యలకు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు. దీని కోసం పురుషులు క్రమం తప్పకుండా ఒక గ్లాసు నీటిలో ప్రత్యేకమైన విత్తనాలను మిక్స్ చేసి తీసుకోవాలి. దాని గురించి తెలుసుకుందాం.

take fennel seeds with water in this way for mens problems

పురుషులు తమ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సోంపు గింజల పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి. పురుషులు ఈ నీళ్లను తాగడం ద్వారా వారు అంగస్తంభన అనగా నపుంసకత్వము నుండి బయట పడవచ్చు. ఒత్తిడి, ధూమపానం, పేలవమైన జీవనశైలి మొదలైన వాటి కారణంగా పురుషుల జననేంద్రియాలకు రక్త ప్రవాహం సరిగ్గా జరగదు.

రక్త ప్రవాహం అంతరాయం కారణంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు జననేంద్రియాలలో తగినంత ఉద్రిక్తత జరగదు. కానీ స్మెల్ అండ్ టేస్ట్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం.. సోంపు గింజలలో ఉండే మెల్లి లైకోరైస్ ఫ్లేవర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్ల పురుషులకు సోంపు గింజల నీళ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజల పొడి కలపండి. దానిపై మూత పెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆనీటిని ఫిల్టర్ చేసి తాగండి. ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అబ్రార్ ముల్తానీ ప్రకారం.. సోంపులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతోపాటు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో జననేంద్రియాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు అంగ స్తంభన సమస్య ఏర్పడదు. అలాగే వీర్యం ఉత్పత్తి అవుతుంది. శుక్ర కణాలు చురుగ్గా కదులుతాయి. నాణ్యంగా ఉంటాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఈ విధంగా సోంపు గింజలను వాడి పురుషులు అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.

]]>
లవంగాలు పురుషులకు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసా ? ఏ సమయంలో తీసుకోవాలంటే..? https://ayurvedam365.com/health-tips-in-telugu/how-cloves-are-beneficial-to-men-take-them-in-these-times.html Thu, 05 Aug 2021 09:07:02 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=4726 లవంగాలు మసాలా దినుసుల జాబితాకు చెందుతాయి. వీటిని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. అయితే లవంగాల్లో అనేక ఔషధగుణాలు ఉండడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. లవంగాలను తింటే జీర్ణవ్యవస్థ ఎంజైమ్‌లు విడుదల అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం, వికారం సమస్యలు తగ్గుతాయి.

how cloves are beneficial to men take them in these times

లవంగాల్లో ఉండే ఫైబర్‌, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది. జలుబు సమస్య ఉన్న వారు లవంగాలను తింటుంటే ఆ సమస్య నుంచి వెంటనే బయట పడవచ్చు. లవంగాల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

లవంగాల్లో విటమిన్లు బి1, బి2, బి4, బి6, బి9, సి లతోపాటు బీటాకెరోటీన్‌, విటమిన్‌ కె, ప్రోటీన్లు ఉంటాయి. ఇవన్నీ మనల్ని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి సంరక్షిస్తాయి.

ఇక లవంగాల వల్ల పురుషులకు ఎంతగానో మేలు జరుగుతుంది. అనేక లైంగిక సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో కాల్షియం, ఐరన్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి. ఇవి పురుషుల్లో లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.

రోజూ ఉదయాన్నే పరగడుపునే 3 లవంగాలను అలాగే నమిలి తినాలి. దీంతో శృంగార జీవితం మెరుగు పడుతుంది. లవంగాలను తినడం వల్ల పురుషుల్లో వచ్చే అనేక సమస్యలు తగ్గుతాయి.

లవంగాలను తింటే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే లవంగాలను రోజుకు మూడు కన్నా ఎక్కువ తినరాదు. తింటే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌పై ప్రభావం పడుతుంది. కనుక రోజుకు మూడు లవంగాలను మాత్రమే తినాలి. ఇక పురుషులు ఉదయం పరగడుపున లవంగాలను తింటే శృంగార సమస్యలు తగ్గుతాయి. అదే రాత్రి నిద్రకు ముందు తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇలా లవంగాలను భిన్న సమయాల్లో తినడం వల్ల భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

]]>
Foods For Men: పురుషులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ముఖ్య‌మైన ఆహారాలు..! https://ayurvedam365.com/nutritious-food/foods-for-men-take-these-foods-for-mens-health.html Thu, 29 Jul 2021 13:47:35 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=4465 Foods For Men: స్త్రీలు, పురుషులు.. ఇరువురి శ‌రీరాలు భిన్నంగా ఉంటాయి క‌నుక ఇరువురికీ భిన్న ర‌కాల ఆహారాలు అవ‌స‌రం అవుతాయి. వారిలో హార్మోన్లు భిన్నంగా ఉంటాయి క‌నుక ప‌లు రకాల ఆహారాల‌ను వారు రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్య‌మైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

foods for men take these foods for mens health

* పురుషులు తృణ ధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వారిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గిస్తాయి. ప్రోస్టేట్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతాయి. కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో టెస్టోస్టిరాన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

* పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే మెగ్నిషియం ర‌క్త‌నాళాల‌ను సాగేలా చేస్తుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. పాల‌కూర‌లో ఉండే ఫోలేట్ హోమోసిస్టీన్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తుంది. దీంతో పురుషులు ఆరోగ్యంగా ఉంటారు.

* సీడ్స్‌, న‌ట్స్ ను పురుషులే కాదు, అంద‌రూ తీసుకోవాల్సిందే. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, అవ‌స‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా వాల్ న‌ట్స్, బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. దీని వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌దు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

* చేప‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. అందువ‌ల్ల చేప‌ల‌ను పురుషులు త‌ర‌చూ తింటుండాలి.

* గుమ్మ‌డికాయ విత్త‌నాలు, పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది పురుషుల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో ఒక‌టి. దీని వ‌ల్ల ప్రోస్టేట్ క్యాన్స‌ర్ ముప్పు త‌గ్గుతుంది. టెస్టోస్టిరాన్ ఉత్ప‌త్తి అవుతుంది. వీర్యం ఉత్ప‌త్తి పెరుగుతుంది. శుక్ర‌క‌ణాలు నాణ్యంగా ఉంటాయి. సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

]]>