వెక్కిళ్లు – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Thu, 12 Aug 2021 18:15:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png వెక్కిళ్లు – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..! https://ayurvedam365.com/health/why-we-get-hiccups-is-it-dangerous-if-they-stay-longer.html Thu, 12 Aug 2021 18:14:39 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=5014 వెక్కిళ్లు అనేవి సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. అవి చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రికి అదే ప‌నిగా వెక్కిళ్లు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రికి సుమారుగా 48 గంట‌ల పాటు వెక్కిళ్లు వ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

వెక్కిళ్లు మన శ‌రీరంలోని డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా.. పొట్ట పై భాగాన ఉండే వర్తులాకార పొరనే డయాఫ్రం అని పిలుస్తారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలో, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతుల్యంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది.

డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది.ఊపిరి వదలగానే మళ్లీ మామూలు స్థితికి వ‌స్తుంది. అయితే ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. ఈ క్ర‌మంలోనే శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. అయితే ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో స‌మ‌న్వ‌యం చేసుకోలేక‌పోతే అప్పుడు ఆ క్రియ‌కు భంగం క‌లుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో హిక్‌ అనే చప్పుడు వస్తుంది. అందుక‌నే ఇంగ్లిష్‌లో వాటిని హిక్క‌ప్స్ అంటారు. ఈ క్ర‌మంలో డయాఫ్రం మ‌ళ్లీ సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దాన్నే వెక్కిళ్లు అంటారు.

ఇక వెక్కిళ్లు వ‌చ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. అవేమిటంటే.. మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మెదడు సంబంధమైన వ్యాధులు, విష పదార్థాలను తీసుకోవ‌డం, శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటి వల్ల, భయం, దుఃఖం వంటి మానసిక కారణాల వల్ల, ఎక్కువగా మసాలా ఉన్న ఆహారం తినడం వల్ల, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తిన‌డం వ‌ల్ల‌, షుగ‌ర్ ఎక్కువైతే, మ‌ద్యం ఎక్కువ‌గా సేవిస్తుంటే, పొగ ఎక్కువ‌గా తాగుతుంటే, నోటిపూత‌, జీర్ణాశ‌య క్యాన్స‌ర్‌, కామెర్లు, అల‌ర్జీ, అజీర్ణం వంటి వాటి వ‌ల్ల వెక్కిళ్లు వ‌స్తాయి. వెక్కిళ్లు వ‌చ్చేందుకు ఇన్ని కార‌ణాలు ఉంటాయి.

వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

వెక్కిళ్లు త‌గ్గేందుకు పాటించాల్సిన చిట్కాలు

చ‌క్కెర‌ను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే వెక్కిళ్లు తగ్గుతాయి. మంచినీళ్లు తాగినా, పచ్చి తాటాకును నమిలి ఊటను మింగుతున్నా, ఉదయం, సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటున్నా వెక్కిళ్లు త‌గ్గుతాయి.

అలాగే మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా, తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా, రాతి ఉసిరికాయలు తింటున్నా, ప్రతిరోజూ వాటి రసం తాగినా, కొబ్బరి బోండాం నీళ్ల‌ను తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి.

బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగినా, కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది, దానిని తాగినా, నిమ్మరసం తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి. నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా, జామకాయను తిన్నా, శొంఠి లేదా కరక్కాయ పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకుని చెంచాడు తేనెను కలిపి చప్పరించినా వెక్కిళ్ల‌ను ఆప‌వ‌చ్చు.

వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

శొంఠి, ఉసిరిక పలుకు, పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటున్నా వెక్కిళ్లు త‌గ్గుతాయి.

అయితే కొంద‌రికి వెక్కిళ్లు ఎంత ప్ర‌య‌త్నించినా త‌గ్గ‌వు. నిరంత‌రాయంగ వ‌స్తూనే ఉంటాయి. 48 గంట‌ల వ‌ర‌కు అవి త‌గ్గాలి. ఆ స‌మ‌యం దాటినా వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. లేదంటే తీవ్ర ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అలాంటి స్థితిలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయ‌రాదు. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి.

]]>
ఎంత సేపైనా వెక్కిళ్లు ఆగ‌డం లేదా ? ఈ 5 చిట్కాలు పాటించి చూడండి..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/5-hiccups-home-remedies-in-telugu.html Thu, 11 Feb 2021 08:07:09 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=1123 వెక్కిళ్లు అనేవి స‌హ‌జంగానే మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. వెక్కిళ్లు వ‌స్తే అస‌లు ఏం చేయాలో అర్థం కాదు. మ‌న‌కు తెలిసిన చికిత్స నీళ్లు తాగ‌డం. గుట‌కలు మింగుతూ నీళ్లు తాగుతాం. దీంతో చాలా వ‌ర‌కు వెక్కిళ్లు త‌గ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు నీటిని తాగినా వెక్కిళ్లు త‌గ్గ‌వు. దీంతో ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.

5 hiccups home remedies in telugu

అయితే ఎవ‌రికైనా వెక్కిళ్లు ఎందుకు ఏర్ప‌డుతాయి ? అనే విష‌యంపై సైంటిస్టులు ఇప్ప‌టికీ స‌రైన కార‌ణం చెప్ప‌లేదు. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల వెక్కిళ్లు వ‌స్తాయ‌ని మాత్రం చెప్పారు. అవేమిటంటే…

* శీత‌ల పానీయాలు, సోడా వంటివి ఎక్కువ‌గా తాగ‌డం

* మ‌ద్యం విప‌రీతంగా సేవించ‌డం

* పొగ తాగ‌డం

* లోప‌లికి పీల్చే గాలి క‌న్నా బ‌య‌ట‌కు వ‌దిలే గాలి శాతం ఎక్కువ‌గా ఉండ‌డం

* బాగా వేగంగా తిన‌డం, ఎక్కువ‌గా తిన‌డం

* స‌డెన్ గా శరీర ఉష్ణోగ్ర‌త‌లో మార్పులు

* బాగా చ‌ల్ల‌గా లేదా బాగా వేడిగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల

* తీవ్ర‌మైన భ‌యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ఎక్సైట్‌మెంట్‌కు గుర‌వ‌డం వ‌ల్ల

పైన తెలిపిన సంద‌ర్భాలతోపాటు కొంద‌రికి బాగా ఏడ్చిన‌ప్పుడు, సాధార‌ణంగా తినేట‌ప్పుడు కూడా వెక్కిళ్లు వ‌స్తాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే వెక్కిళ్ల‌ను తగ్గించుకోవ‌చ్చు. అవేమిటంటే…

1. ఒక సుదీర్ఘ‌మైన శ్వాస తీసుకోవాలి. లోప‌లికి గాలిని బాగా పీల్చాలి. దాన్ని అలాగే హోల్డ్ చేసి 10 సెక‌న్ల పాటు ఉంచాలి. త‌రువాత నెమ్మ‌దిగా శ్వాస‌ను విడ‌వాలి. పూర్తిగా శ్వాస‌ను వ‌ద‌ల‌కుండానే మ‌ళ్లీ 5 సెక‌న్ల పాటు అలాగే గాలిని అదిమిప‌ట్టి ఉంచాలి. త‌రువాత గాలిని పూర్తిగా విడ‌వాలి. ఈ టెక్నిక్‌ను డాక్ట‌ర్ ల‌క్ జి.మోరిస్ సూచించారు. దీన్ని పాటించ‌డం వ‌ల్ల వెక్కిళ్లు త‌గ్గిపోతాయి.

2. న‌డుమును స‌గం వ‌ర‌కు వంచి నేల‌పై లేదా టేబుల్‌పై ఉన్న గ్లాస్ లోని నీటిని తాగాలి. అందుకు అవ‌స‌రం అయితే స్ట్రా పెట్టి తాగ‌వచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది. ఎంత‌టి మొండి వెక్కిళ్లు అయినా ఇట్టే త‌గ్గిపోతాయి. కానీ ఈ చిట్కాను చాలా జాగ్ర‌త్త‌గా పాటించాల్సి ఉంటుంది.

3. ఏ చిట్కాను పాటించినా వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే.. సుదీర్ఘ‌మైన స‌మ‌యం నుంచి వెక్కిళ్లు వ‌స్తుంటే ఈ చిట్కాను పాటించాలి. దీని గురించి ఆయుర్వేదంలో ఇచ్చారు. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ ఆముదం నూనెను తీసుకుని రెండింటినీ క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మంలో వేలిని ముంచి అనంత‌రం ఆ వేలిని నాకాలి. ఇలా 2 నుంచి 3 సార్లు చేయాలి. దీంతో వెక్కిళ్లు త‌గ్గుతాయి.

4. చేదు, వ‌గ‌రు, పులుపు క‌ల‌గ‌లిపిన పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా వెక్కిళ్లు ఆగిపోతాయి. ఇలాంటి పండ్ల జాబితాలో గ్రీన్ ఆలివ్స్ మొద‌టి వ‌రుస‌లో నిలుస్తాయి. వీటిని సూప‌ర్ మార్కెట్ల‌లో విక్ర‌యిస్తారు.

5. వెక్కిళ్లు బాగా వ‌స్తుంటే నేల‌పై కూర్చుని కాళ్ల‌ను ముందుకు చాపాలి. అనంత‌రం వాటిని మ‌డిచి మోకాళ్ల‌ను ఛాతి వ‌ద్ద‌కు తేవాలి. ఇలా కొంత సేపు ఉండాలి. దీంతో వెక్కిళ్లు ఆగిపోతాయి.

ఈ చిట్కాల‌ను పాటించినా వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే తీవ్ర‌మైన స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు గుర్తించాలి. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి.

]]>