bajra – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Sun, 28 Aug 2022 07:23:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png bajra – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Bajra : సజ్జలను నేరుగా తినలేరా.. ఇలా చేస్తే ఎంతైనా అలవోకగా తినేస్తారు.. https://ayurvedam365.com/news/if-you-not-like-bajra-then-make-sweet-them.html Sun, 28 Aug 2022 07:23:28 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=17399 Bajra : చిరు ధాన్యాలను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో సజ్జలు కూడా ముఖ్యమైనవే. మన పూర్వ కాలంలో పెద్దలు వీటినే తినేవారు. అయితే సజ్జలను నేరుగా ఉడకబెట్టి తినలేకపోతుంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే.. ఎవరైనా సరే సజ్జలను తిష్టంగా తింటారు. వీటితో స్వీట్‌ను తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు.. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. సజ్జలతో స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సజ్జలతో స్వీట్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

సజ్జ పిండి – 250 గ్రాములు, శనగపిండి – 30 గ్రాములు, బెల్లం – 250 గ్రాములు, యాలకుల పొడి – 10 గ్రాములు, నూనె – వేయించడానికి సరిపడా, నెయ్యి – 5 గ్రాములు.

if you not like Bajra then make sweet them
Bajra

సజ్జలతో స్వీట్‌ను తయారు చేసే విధానం..

సజ్జ పిండి, శనగపిండి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో నీరు పోసి గరిటె జారుగా కలపాలి. కడాయిలో నూనె పోసి కాగిన తరువాత కలిపిన పిండిని బూందీ చట్రంలో పోస్తూ బూందీని తయారు చేసుకోవాలి. విడిగా బెల్లాన్ని ఉండ పాకం రానిచ్చి అందులో యాలకుల పొడి, బూందీ వేసి కలపాలి. తరువాత ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి ఆ బూందీని అచ్చులా పరిచి చల్లారిన తరువాత డబ్బాలో నిల్వ చేయాలి.

ఇలా తయారు చేసిన సజ్జల స్వీట్‌లో ప్రోటీన్లు 10.2 గ్రాములు, ఫైబర్‌ 0.99 గ్రాములు, కాల్షియం 62.0 మిల్లీగ్రాములు, ఐరన్‌ 5.1 మిల్లీగ్రాములు లభిస్తాయి. ఈ స్వీట్‌ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని తినడం వల్ల పోషకాలు, శక్తి, ఆరోగ్యం అన్నింటినీ పొందవచ్చు.

]]>
దీన్ని రోజూ తీసుకోండి.. శ‌క్తి బాగా ల‌భించి ఎంత ప‌నైనా చేస్తారు..! https://ayurvedam365.com/healthy-food-recipes/healthy-food/sajja-pindi-majjiga-pearl-millet-buttermilk-recipe.html Tue, 16 Feb 2021 11:07:25 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=1290 సజ్జలు మిల్లెట్స్‌ జాబితాకు చెందుతాయి. వీటినే చిరు ధాన్యాలు, సిరి ధాన్యాలు అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే ఇవి మనకు అనేక పోషకాలను అందివ్వడంతోపాటు శక్తిని కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే సజ్జలను ఎలా తీసుకోవాలి ? అని అనుకునేవారికి కింద తెలిపిన టిప్‌ ఉపయోగపడుతుంది. సజ్జలను తీసుకోవాలనుకునే వారు వాటితో పిండి చేసుకుని ఆ పిండిని మజ్జిగతో కలిపి దాంతో చక్కని వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దాన్ని నిత్యం తయారు చేసుకుని తాగితే శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి.

sajja pindi majjiga pearl millet buttermilk recipe

సజ్జ పిండి మజ్జిగ తయారు చేసే విధానం

బాగా మందంగా ఉండే అడుగు ఉన్న గిన్నె తీసుకుని రెండు టీస్పూన్ల సజ్జ పిండిని తీసుకుని నూనె లేకుండా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. 2 టీస్పూన్ల సజ్జ పిండికి 1 కప్పు నీళ్లు సరిపోతాయి. ఒకసారి పొంగు రాగానే మంట తగ్గించి దానికి కప్పు మజ్జిగ కలిపి పెట్టుకోవాలి. మరో నిమిషం పాటు ఉడికించి దించి చల్లార్చుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన అల్లం, పావు టీస్పూన్‌ అల్లం రసం కలుపుకోవాలి. ఎండ వేడి మూలంగా ఏర్పడే అలసట, నిస్సత్తువ, నీరసం వంటి సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే ఈ విధంగా సజ్జపిండి మజ్జిగను తయారు చేసుకుని నిత్యం సేవించవచ్చు. చక్కని రంగు రావాలంటే అందులో కొద్దిగా దానిమ్మరసం లేదా అనార్‌ దానా కలుపుకుని తాగవచ్చు.

సజ్జలు చిరు ధాన్యాలు కనుక వాటితో అన్నంలా వండుకుని తినలేం అనుకునే వారు వాటిని నిత్యం ఈ విధంగా తీసుకున్నా.. వాటి ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. శ‌క్తి లేనట్లు బ‌ల‌హీనంగా ఉండేవారు రోజూ దీన్ని తాగితే అమిత‌మైన శ‌క్తి ల‌భిస్తుంది. ఎంతో ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత‌టి ప‌ని చేసినా అంత త్వ‌ర‌గా అల‌సిపోరు.

 

]]>