Cabbage Soup – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Wed, 18 Dec 2024 15:20:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Cabbage Soup – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Cabbage Soup : క్యాబేజ్ తో ఇలా సూప్ ట్రై చేయండి.. ఎంత పెద్ద పొట్ట అయినా సరే మొత్తం కరిగిపోతుంది..! https://ayurvedam365.com/food/make-cabbage-soup-like-this-and-drink-for-many-benefits.html Wed, 18 Dec 2024 15:20:08 +0000 https://ayurvedam365.com/?p=62697 Cabbage Soup : వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగటం సహజమే. ఈ విషయం పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగా కనిపిస్తుంది. శరీరాకృతినే మార్చేసి చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపించే విధంగా చేస్తుంది. పొట్టలో కొవ్వు పెరగటం వల్ల అందానికే కాదు ఆరోగ్యానికీ కీడు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ అస్కారం ఏర్పడుతుంది.

జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వలన పెద్ద పొట్టను తగ్గించుకునే ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెద్ద పొట్టతో బాధపడేవారు పొట్టలో కొవ్వును కరిగించుకోవడానికి డ్రింక్స్, సూప్ లు బాగా సహాయపడతాయి . క్యాబేజీ సూప్ కి మంచి రుచితో పాటు, కొవ్వు కరిగించే గుణాలు అత్యధికంగా ఉన్నాయి. క్యాబేజీతో బాడీ ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఉన్న ఈ సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

make cabbage soup like this and drink for many benefits

సూప్ కి కావాల్సిన పదార్ధాలు..

సన్నగా తరిగిపెట్టుకున్న ఒక క్యాబేజ్, రెండు క్యారెట్స్ సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడ ఉప్పు, ఒక టీ స్పూన్ బటర్.. క్యాబేజీ సూప్ కి అవసరం.

ఇప్పుడు సూప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటిని ప్రెజర్ కుక్కర్ లో ఒక లీటర్ నీళ్ళు పోసి మరిగించాలి. రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ పై పాన్ పెట్టి బటర్ వేసి అందులో వెజిటుబుల్స్ ని ఉడికించిన నీరుని పోయాలి. అందులో ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇక సూప్ చిక్కగా రావడం కోసం కొద్దిగా 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని ఆ నీళ్ళలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అంతే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ రెడీ అయినట్లే. ఇలా రోజు సాయంత్రం సమయంలో క్యాబేజీ తీసుకోవడం వలన పొట్టలో కొవ్వు కరిగి సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

]]>