Cinnamon Water – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Tue, 05 Dec 2023 16:37:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Cinnamon Water – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Cinnamon Water For Weight Loss : దాల్చిన చెక్క నీళ్ల‌ను తాగితే అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసా..? https://ayurvedam365.com/health-tips-in-telugu/cinnamon-water-for-weight-loss-how-it-works-perfectly.html Tue, 05 Dec 2023 16:35:50 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=43474 Cinnamon Water For Weight Loss : మ‌నం వంటల్లో వాడే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క‌ ఒక‌టి. దాల్చిన చెక్క ఘాటైన వాస‌నను క‌లిగి ఉంటుంది. వీటిని వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. దాల్చిన‌చెక్క‌ వేయ‌డం వ‌ల్ల వంట‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని అందించ‌డంతో పాటు దాల్చిన చెక్క మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన చెక్క థ‌ర్మోజెనిక్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంది.

శ‌రీరంలో వేడి పెరుగుతుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి. క‌నుక మనం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుప‌డుతుంది. అలాగే దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి త‌గ్గుతుంది. జంక్ ఫుడ్, బ‌యట ఆహారాల‌ను తీసుకోవాల‌నే కోరిక త‌గ్గుతుంది. దీంతో మ‌న శ‌రీరంలోకి అద‌నంగా క్యాల‌రీలు వెళ్ల‌కుండా ఉంటాయి.

Cinnamon Water For Weight Loss how it works perfectly
Cinnamon Water For Weight Loss

అదే విధంగా జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా దాల్చిన చెక్క నీరు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరం పోష‌కాల‌ను గ్ర‌హించే శ‌క్తి పెరుగుతుంది. అలాగే దాల్చిన చెక్క‌లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ లక్ష‌ణాలు కూడా అధికంగా ఉంటాయి. కనుక దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క‌ణాల‌ల్లో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. ఫ్రీరాడికల్స్ కార‌ణంగా శ‌రీరానికి హాని క‌ల‌గ‌కుండా కాపాడ‌డంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వల్ల నీటిని ఎక్కువ‌గా తాగాల‌నే కోరిక క‌లుగుతుంది. దీంతో శ‌రీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే ఎక్కువ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ దాల్చిన చెక్క నీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. వేడి నీటిలో దాల్చిన చెక్క పొడిని, పుదీనా ఆకులు వేసి ఉంచాలి. ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి త‌రువాత వ‌డ‌క‌ట్టి నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌చ్చు అలాగే నీటిలో దాల్చిన చెక్క వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ఈ నీటిని వ‌డ‌క‌ట్టి నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవాలి. ఈ విధంగా దాల్చిన చెక్క నీటిని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా కాపాడుకోవ‌చ్చు.

]]>
Cinnamon Water : దాల్చిన చెక్క నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..? https://ayurvedam365.com/health-tips-in-telugu/cinnamon-water-health-benefits-in-telugu.html Thu, 02 Nov 2023 04:43:21 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=41844 Cinnamon Water : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దాల్చిన చెక్క ఘాటైన వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని మ‌నం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. ముఖ్యంగా మ‌సాలా వంట‌కాల్లో దీనిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. దాల్చిన చెక్క వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే దీనిని వంటల్లో వాడ‌డానికి బ‌దులుగా దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున దాల్చిన చెక్క నీటిని తాగ‌డం వ‌ల్ల మనం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ఇలా ఉద‌యం పూట ప‌ర‌గ‌డుపున దాల్చిన చెక్క టీని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. దాల్చిన చెక్క నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బ‌యాటిక్, యాంటీ వైర‌ల్ గుణాలు శ‌రీరాన్ని ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ప‌ర‌గ‌డుపున ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. క‌డుపు ఉబ్బ‌రం,గ్యస్, క‌డుపులో నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది.

Cinnamon Water health benefits in telugu
Cinnamon Water

మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ముఖ్యంగా స్ల్రీలల్లో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి సమ‌స్య‌లు త‌గ్గుతాయి. నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే పొత్తి క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. అలాగే వ్యాయామం చేసిన త‌రువాత ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల కండ‌రాలు విశ్రాంతికి గురి అవుతాయి. కండ‌రాల్లో మంట వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా దాల్చిన చెక్క నీరు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని దాల్చిన చెక్క నీటిని ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

]]>