corn – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Tue, 24 Sep 2024 15:44:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png corn – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 ఏంటి.. మొక్క‌జొన్న‌ను తింటే.. ఇన్ని లాభాలా..? https://ayurvedam365.com/health-tips-in-telugu/many-amazing-benefits-with-corn-you-do-not-know.html Tue, 24 Sep 2024 15:44:49 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=48673 మొక్క‌జొన్నా.. నీ మేలు మరవలేనిది. నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నీగురించి తెలిసాక సర్వ ఔషధాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది. ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు. ఐలవ్ యూ స్వీట్ హాట్.. స్వీట్ కార్న్.. ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా.. ఇందులో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు తెచ్చుకుంటారు.

అవును, మొక్కజొన్నల‌తో క‌లిగే లాభాలు అన్నీఇన్నీ కావు. చాలా దీర్ఘ కాలిక వ్యాధులకు అమృత ఔషధంలా పనిచేస్తుంది. మనకు తెలిసి మొక్కజొన్నను కాల్చుకొని తింటాం, ఉడకబెట్టుకొని తింటాం, మహా అయితే కార్న్ ఫ్రై, పాప్ కార్న్‌ మనకు తెలిసినవి. ఇవి మాత్రమే. తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో చాలా ఔషధాల్లో, తినుబండారాల్లో, విస్కీల్లో, పౌడర్లలో, ఇంకా చాలా వరకు తయారీల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఔషధాల్లో మొక్కజొన్న పాత్ర కీలకమైనది.

many amazing benefits with corn you do not know

కార్న్ లో ఉన్నటువంటి లూటెయిన్, జియాజాంతిన్ అనే పోష‌కాలు మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లేవిన్, ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. మొక్కజొన్న వలన మధుమేహం, రక్తహీన‌త‌, జీర్ణ స‌మ‌స్య‌లు, మలబ‌ద్దకం, కొలెస్ట్రాల్, మూత్రపిండాల స‌మ‌స్య‌లు.. ఇలా ఎన్నో ధీర్ఘ కాలిక వ్యాదులను నియంత్రించడంలో మొక్కజొన్న దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ప్రపంచంలో 4వ స్థానానికి మొక్కజొన్న పంట చేరుకుందంటే దీని ప్రత్యేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంకేంటి మ‌రి.. మొక్క జొన్న పొత్తులు మార్కెట్ లో దొరికే సీజన్.. వెళ్లండి సంచులు పట్టుకొని మార్కెట్ కు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.

]]>
Charcoal Corn Side Effects : దీన్ని తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌.. ఎంతోమంది దీని బారిన ప‌డుతున్నారు.. https://ayurvedam365.com/health-tips-in-telugu/charcoal-corn-side-effects-taking-these-will-get-you-cancer.html Tue, 10 Oct 2023 08:26:05 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=40732 Charcoal Corn Side Effects : మ‌నం మొక్క‌జొన్న కంకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మొక్క‌జొన్న కంకుల్లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డంలో, మ‌ల‌బద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, క్యాన్స‌ర్ వ్యాధి బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మొక్క‌జొన్న కంకులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ మొక్క‌జొన్న కంకుల‌ను మ‌నం వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటాము. కొంద‌రు ఉడికించి తీసుకుంటారు. కొంద‌రు నిప్పుల‌పై కాల్చి వాటికి ఉప్పు, నిమ్మ‌ర‌సం రాసి మ‌రీ తీసుకుంటారు.

ఇలాకాల్చి తీసుకున్న మొక్క‌జొన్న కంకులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది కూడా కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. ఉడికించడం వ‌ల్ల మొక్క‌జొన్న గింజ‌ల్లో ఉండే తీపి త‌గ్గిపోతుంది. క‌నుక వీటిని ఉడికించిన మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అదే కాల్చిన మొక్క‌జొన్న కంకులు చూడ‌డానికి చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు స్మోకి ప్లేవ‌ర్ తో చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న ఎక్కువ‌గా ఈ కాల్చిన కంకులు ల‌భిస్తాయి. అయితే కాల్చిన మొక్క‌జొన్న కంకులే రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చైనా దేశ శాస్త్ర‌వేత్త‌లు 405 మంది పిల్ల‌ల‌పై జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

Charcoal Corn Side Effects taking these will get you cancer
Charcoal Corn Side Effects

కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను వ‌రుస‌గా 16 రోజుల పాటు పిల్ల‌లకు ఇచ్చి ప‌ప‌రిశోధ‌నలు జ‌రిపారు. ఇలా కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను తీసుకోవ‌డం వల్ల దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తింటుంద‌ని నిపుణులు తెలియ‌జేసారు. కంకుల‌ను కాల్చ‌డం వ‌ల్ల వాటి నుండి ఫ్లోరిన్ ఎక్కువ‌గా విడుద‌ల అవుతుంద‌ని దీంతో అది దంతాల‌పై ఉండే ఎనామిల్ ను దెబ్బ‌తీస్తుంద‌ని నిపుణులు తెలియ‌జేసారు. అలాగే న‌ల్ల‌గా కాల్చిన కంకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోకి కార్బ‌న్ ఎక్కువ‌గా ప్ర‌వేశిస్తుంది. దీంతో శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే క్యాన్స‌ర్ క‌ణాలుగా కూడా మారే అవ‌కాశం ఉంది. అలాగే శ‌రీరంలో ఫ్రీరాడికల్స్ స్థాయిలు ఎక్కువ‌య్యి క్యాన్స‌ర్ తో పాటు వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది.

అదే విధంగా కాల్చిన కంకుల‌ను తిన‌డం వ‌ల్ల వాటిపై ఉండే మాడు కార‌ణంగా జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవకాశం కూడా ఉంది. క‌నుక కంకుల‌ను కాల్చి తీసుకోకూడదు. వీలైనంత వ‌ర‌కు ఉడికించి తీసుకోవాలి. ఉడికించిన కంకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు త‌ప్పే ఎటువంటి హాని క‌ల‌గ‌దు. కాల్చ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కంకులే అనారోగ్యానికి దారి తీస్తాయి. క‌నుక త‌రుచూ కాకుండా ఎప్పుడోక‌ప్పుడు మాత్ర‌మే కంకుల‌ను కాల్చి తీసుకోవాలి. అది కూడా మ‌రీ న‌ల్ల‌గా కాల్చి తీసుకోకూడ‌దు.అలాగే కంకుల‌ను కాల్చేట‌ప్పుడు నేరుగా బొగ్గుల‌పై కాల్చ‌కుండా వీటిపై ఉండే పొట్టును తీయ‌కుండా అలాగే కాల్చి తీసుకోవాలి. ఇలా పొట్టుతో కాల్చి తీసుకోవ‌డం వ‌ల్ల కంకుల‌ను కాల్చిన‌ప్ప‌టికి మ‌న‌కు హాని క‌ల‌గ‌కుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

]]>
Corn : మొక్క‌జొన్న కంకుల‌ను త‌ర‌చూ తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..! https://ayurvedam365.com/health-tips-in-telugu/if-you-are-eating-corn-everyday-then-you-should-know-this.html Sun, 26 Jun 2022 10:44:37 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=14986 Corn : వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు మ‌న‌కు వేడి వేడి గా ఏదైనా తినాల‌నిపిస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి మొక్క‌జొన్న కంకులు. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. మొక్కజొన్న కంకుల‌ను మ‌నం వివిధ రూపాల‌లో ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్క‌జొన్న పిండితో కూడా మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మొక్క జొన్న‌ను ఏవిధంగా తీసుకున్నా కూడా మ‌న‌కు మేలు క‌లుగుతుంది.

మొక్క‌జొన్న పోష‌కాల గ‌ని అని నిపుణులు చెబుతున్నారు. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. మొక్క‌జొన్న‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల ప్రేగు క‌ద‌లిక‌లు పెరిగి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో కూడా ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మొక్క‌జొన్నలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు దీనిని తిన‌డం వ‌ల్ల గ‌ర్భస్త శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క‌జొన్నను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వీటిలో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి. క‌నుక బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌వారు వీటిని తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు పెరుగుతారు.

if you are eating Corn everyday then you should know this
Corn

మూత్ర‌పిండాల‌ ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌లను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మొక్క‌జొన్న‌ల‌లో అధికంగా ఉండే ఐర‌న్ ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. మొక్క జొన్న‌లు ఒక బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. మొక్క‌జొన్న గింజ‌ల‌తో పాప్ కార్న్, పేలాలు, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని త‌యారు చేస్తారు. లేత మొక్క‌జొన్న కంకుల‌ను మ‌నం స‌లాడ్ ల‌లో, కూర‌ల‌లో ఉప‌యోగిస్తాం. మొక్క‌జొన్న పిండితో కూడా రొట్టెల‌ను త‌యారు చేస్తారు. మొక్క‌జొన్న గింజ‌ల నుండి నూనెను కూడా తీస్తారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారు మొక్క‌జొన్నల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో మొక్క‌జొన్న ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది.

మొక్క‌జొన్న‌ను ప‌శువుల‌కు, కోళ్ల‌కు దాణాగా కూడా ఉప‌యోగిస్తారు. అనేక ర‌కాల పారిశ్రామిక ఉత్త‌త్పుల త‌యారీలో కూడా దీనిని ఉప‌యోగిస్తారు. మొక్క‌జొన్న కంకులే కాకుండా మొక్క‌జొన్న వేర్లు, కాండం నుండి తీసిన క‌షాయాన్ని తాగ‌డం వల్ల కూడా మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మొక్క‌జొన్న‌ను అధిక మొత్తంలో పండిస్తున్నారు. పూర్వ‌కాలంలో వీటిని కేవ‌లం కాల్చుకుని తినేవారు. కానీ ప్ర‌స్తుత కాలంలో వీటిని ఔష‌ధాల‌ త‌యారీలో కూడా ఉప‌యోగిస్తున్నారు. ఈ విధంగా మొక్క‌జొన్న‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని, దీనిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

]]>
మొక్క‌జొన్న‌లు సూప‌ర్ ఫుడ్‌.. వీటిని రోజూ తీసుకోవాల్సిందే.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు..! https://ayurvedam365.com/health-tips-in-telugu/health-benefits-of-corn.html Mon, 12 Jul 2021 07:20:30 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=3683 సుమారుగా 10వేల ఏళ్ల కింద‌టి నుంచే మొక్క‌జొన్న‌ను సాగు చేయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌ట్లో దీన్ని మెక్సికో, మ‌ధ్య అమెరికాల్లో పండించేవారు. అయితే ప్ర‌పంచంలో ఇప్పుడు ఏ మూల‌కు వెళ్లినా మ‌న‌కు మొక్క జొన్న ల‌భిస్తుంది. ఇందులో ఫైబ‌ర్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మ‌న‌కు రెండు ర‌కాల కార్న్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి స్వీట్ కార్న్‌. కాగా రెండోది మ‌న‌కు లోక‌ల్ గా ల‌భించే సాధార‌ణ మొక్క‌జొన్న‌. అయితే స్వీట్ కార్న్ క‌న్నా లోక‌ల్ మొక్క జొన్న‌ను తిన‌డ‌మే ఉత్త‌మం. దీని ద్వారా మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of corn

1. మొక్క‌జొన్న‌లో విట‌మిన్ బి12 అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల విట‌మిన్ బి12 లోపం ఉన్న‌వారు త‌ర‌చూ మొక్క జొన్న‌ల‌ను తిన‌డం మంచిది.

2. మొక్క‌జొన్న‌లోని విట‌మిన్ బి12, ఫోలిక్ యాసిడ్‌, ఐర‌న్‌లు శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి దోహ‌దం చేస్తాయి. దీంతో అనీమియా (రక్త‌హీన‌త‌) స‌మ‌స్య త‌గ్గుతుంది.

3. రోజూ శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారు, వ్యాయామం చేసేవారు, జిమ్‌ల‌కు వెళ్లేవారు, విద్యార్థుల‌కు శ‌క్తి బాగా కావాలి. అందువ‌ల్ల వారు మొక్క‌జొన్న‌ల‌ను తినాలి. దీంతో బ‌లం బాగా వ‌స్తుంది. దృఢంగా మారుతారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఎక్కువ పనిచేసినా అల‌సిపోరు.

4. సన్న‌గా ఉన్నామ‌ని దిగులు చెందేవారు రోజూ మొక్క‌జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు పెరుగుతారు. ఆరోగ్యవంత‌మైన రీతిలో బ‌రువు పెర‌గ‌వ‌చ్చు.

5. మొక్క‌జొన్న‌ల్లో విట‌మిన్లు బి1, బి5, సి లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మొక్క‌జొన్న‌ల్లో పిండి ప‌దార్థాలు అధికంగా ఉంటాయి క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు తిన‌కూడ‌ద‌ని భావిస్తుంటారు. కానీ నిజానికి వీటిలో ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ రూపంలో వీటిని ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవ‌చ్చు. లేదా వీటితో త‌యారు చేసే సూప్‌ను తాగ‌వ‌చ్చు.

6. గ‌ర్భిణీలు మొక్క‌జొన్న‌ల‌ను క‌చ్చితంగా తినాలి. వీటిల్లో ఫోలిక్ యాసిడ్‌, జియాజాంతిన్‌, పాథోజెనిక్ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి శిశువుల్లో పుట్టుక‌తో లోపాలు ఉండ‌కుండా చూస్తాయి. అందువ‌ల్ల గ‌ర్భిణీలు వీటిని క‌చ్చితంగా తినాలి.

7. మొక్క‌జొన్న‌ల్లో విట‌మిన్ సి, లైకోపీన్‌లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటుంటే చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

మొక్క‌జొన్న‌ల‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో ఉడ‌క‌బెట్టుకుని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవ‌చ్చు. లేదా సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో తీసుకోవ‌చ్చు. లేదంటే వీటితో సూప్ త‌యారు చేసుకుని కూడా తాగ‌వ‌చ్చు. ఎలా తీసుకున్నా మొక్క‌జొన్న‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

]]>
రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌.. ఇలా చేసుకోండి..! https://ayurvedam365.com/healthy-food-recipes/healthy-food/corn-green-chilli-salad-recipe-in-telugu.html Fri, 26 Feb 2021 08:40:03 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=1524 మొక్క‌జొన్న‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్క‌జొన్న‌ల‌ను అలాగే కాల్చుకుని తింటారు. లేదా ఉడ‌క‌బెట్టి తింటారు. ఎలా తిన్నా ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. అయితే వీటితోపాటు ప‌చ్చి మిర్చి క‌లిపి స‌లాడ్ చేసుకుని తింటే ఇంకా రుచిక‌రంగా ఉంటాయి. పైగా పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌రి మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

corn green chilli salad recipe in telugu

మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు

మొక్కజొన్న గింజ‌లు – 1 క‌ప్పు
ప‌చ్చిమిర్చి – 4
వెన్న – 2 టీస్పూన్స్
చ‌క్కెర – 1 టీస్పూన్

మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్ తయారు చేసే విధానం

మొక్క‌జొన్న గింజ‌ల‌ను ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. వెన్న‌ను వేడి చేసి ఉడికించిన మొక్క‌జొన్న గింజ‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేయాలి. అవి ఉడుకుతుండ‌గా చ‌క్కెర‌ను చ‌ల్లుకోవాలి. తీపి అవ‌స‌రం లేదు, కారంగానే ఉండాలి అనుకుంటే చ‌క్కెర‌ను వేయాల్సిన ప‌నిలేదు. త‌రువాత త‌క్కువ మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దించేసుకోవాలి. చ‌ల్లారాక కొద్దిగా క్రీమ్ చ‌ల్లుకోవ‌చ్చు. దీంతో స‌లాడ్ రుచిగా ఉంటుంది. కొద్దిగా వేడిగా ఉండ‌గా తింటే భ‌లే రుచిగా అనిపిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

]]>