Garikapati Narasimha Rao – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Sun, 15 Dec 2024 16:50:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Garikapati Narasimha Rao – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Garikapati Narasimha Rao : పానీపూరీల‌ను తినే వారంద‌రూ త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..! https://ayurvedam365.com/health-tips-in-telugu/if-you-are-eating-pani-puri-then-know-this.html Sun, 15 Dec 2024 16:50:19 +0000 https://ayurvedam365.com/?p=62136 Garikapati Narasimha Rao : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో పానీపూరీ కూడా ఒక‌టి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో ఇది మ‌న‌క ల‌భిస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఎక్క‌డ‌పడితే అక్క‌డ ఇది మ‌న‌కు ల‌భిస్తూ ఉంటుంది. ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న ల‌భిస్తూ ఉంటుంది. ప్ర‌జ‌లు ఇక్క‌డ అక్క‌డ అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దీనిని తింటూ ఉంటారు. అయితే చాలా మంది వ్యాపారులు దీనిని శుభ్ర‌త లేకుండా త‌యారు చేస్తారు. పానీపూరీలో నీటిని ఏ నీటితో త‌యారు చేస్తారో తెలియ‌దు. అందులో వాడే కూర‌ను కూడా అపరిశుభ్ర వాతావ‌ర‌ణంలోనే త‌యారు చేస్తారు. అలాగే ఈ నీటిని చేత్తో క‌లుపుతూ ఉంటారు. చేతికి ఎటువంటి తొడుగులు లేకుండానే ప్ర‌జ‌ల‌కు వాటిని అందిస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఈ పానీపూరీ బండ్ల‌ను ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న మురికి కాలువ‌ల ప‌క్క‌న ఉంచుతారు. పానీపూరీ బండి ద‌గ్గ‌రికి వెళ్ల‌గానే ముందుగా మ‌న‌కు మురికి కాలువ వాస‌న వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే అక్క‌డ ఉండే ఈగ‌లు పానీపూరీ చేసే వ‌స్తువుల‌పై వాల‌డం కూడా జ‌రుగుతుంది. అయిన‌ప్ప‌టికి ప్ర‌జ‌లు వాటినే తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఈ పానీపూరీ చేసే వారు కూడా చెమ‌ట‌లు ప‌ట్టి అప‌రిశుభ్రంగానే ఉంటారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో త‌యారు చేసిన పానీపూరీని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్యాల‌ను కొని తెచ్చుకోవ‌డ‌మే అవుతుంది. ఈ పానీపూరీ గురించి ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, ప్ర‌వ‌చ‌న క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావుగారు మాట్లాడుతూ ఎంత అప‌రిశుభ్రంగా చేసిన‌ప్ప‌టికి ప్ర‌జ‌లు ఇటువంటి వాటినే తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకునేట‌ప్పుడు రుచితో పాటు సుచి కూడా చాలా ముఖ్య‌మ‌ని చెప్పారు. మ‌నం తీసుకునే ఆహారానికి రుచి, సుచి అనే రెండు ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు ఉండాల‌ని వారు తెలియ‌జేసారు.

if you are eating pani puri then know this

రుచి లేక‌పోయిన‌ప్ప‌టికి మ‌నం తీసుకునే ఆహారం త‌ప్ప‌కుండా సుచిగా ఉండాల‌ని మ‌న మొద‌టి ప్రాధాన్యం సుచికే ఇవ్వాల‌ని చెప్పారు. అంతేకాకుండా ఈ మ‌ధ్య కాలంలో పాడైపోయిన కేకుల‌ను కూడా పైన మంచిగా డెక‌రేట్ చేసి అమ్మేస్తున్నార‌ని ప్ర‌జ‌లు వాటినే కొనుగోలు చేసి తింటున్నారని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్ర‌జ‌లు ఏది నిజ‌మో ఏది అబ‌ద్ద‌మో తెలుసుకోకుండానే వారికి ఇష్ట‌మైన న‌టులు, క్రికెట‌ర్లు చెప్పిన వాటిని కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్నార‌ని త‌న ఆవేదన‌ను వ్య‌క్తం చేసారు. క‌నుక ప్ర‌జ‌లు ఆహారాన్ని తీసుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించ‌డం అవ‌స‌ర‌మని త‌నదైన శైలిలో వ్య‌క్తప‌రిచారు.

]]>