Job Problems – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Wed, 18 Dec 2024 12:25:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Job Problems – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Job Problems : ఉద్యోగం లేదా..? ప్రమోషన్ రావట్లేదా..? ఇలా చేస్తే అనుకున్నది అవుతుంది..! https://ayurvedam365.com/devotional/if-you-are-not-getting-job-promotion-then-do-like-this.html Wed, 18 Dec 2024 12:25:52 +0000 https://ayurvedam365.com/?p=62669 Job Problems : మీరు, మీ ఉద్యోగాన్ని కోల్పోయారా..? ఉద్యోగాన్ని పొందాలని అనుకుంటున్నారా..? అయినా సరే ఎంత కష్టపడినా, ఉద్యోగం రావట్లేదా..? లేదంటే మీకు ప్రమోషన్ రావట్లేదా ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు, ఈ వాస్తు చిట్కాలు ని పాటించడం మంచిది. ఇలా చేస్తే, మంచి ఉద్యోగం దొరుకుతుంది. ప్రమోషన్ రావాలని అనుకున్న వాళ్ళకి, ప్రమోషన్ కూడా వస్తుంది. మరి ఇక పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడే చూసేద్దాము. వాస్తు ప్రకారం, ఇంటి ఈశాన్యం ఎప్పుడు కూడా శుభ్రంగానే ఉండాలి. జీవితంలో పెరుగుదల, సంతోషాన్ని పెంచడానికి ఈశాన్యంలో బరువులని అసలు పెట్టకండి.

ఈశాన్యం వైపు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. జీవితంలో వృత్తిని, విజయాన్ని, శ్రేయస్సుని ఈశాన్యం సూచిస్తుంది. ఈశాన్యం మూలతో వృత్తికి సంబంధించిన ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈశాన్యం వైపు, వాటర్ ఫౌంటెన్ ఉంటే మంచి జరుగుతుంది. అభివృద్ధి సాధిస్తారు. కెరియర్ లో ముందుకు వెళ్లడానికి కూడా అవుతుంది. ఈశాన్యం మూలలో వాటర్ ఫౌంటెన్ వంటివి పెట్టడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

if you are not getting job promotion then do like this

డబ్బులు కూడా ఉత్తరం వైపు ఉన్న అల్మారా లో పెట్టుకోవాలి. అలా చేస్తే, విజయాన్ని అందుకోవచ్చు. ఉత్తరం వైపు ఉన్న అల్మారా లో డబ్బులు పెడితే, అది పెరుగుదలని సూచిస్తుంది. జీవితంలో విజయాన్ని అందుకోవాలన్నా, కెరియర్లో మార్పు రావాలన్నా పూజగది విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. పూజగదిని ఏర్పాటు చేసేటప్పుడు, అది సరైన దిశలో పెట్టాలి.

అలా ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది. నిద్రపోవడం కూడా వాస్తు శాస్త్రంలో కీలకంగా పరిగణించబడింది. నిద్రపోయేటప్పుడు మీ యొక్క తల పడమర వైపు ఉండాలి. కాళ్లు తూర్పు వైపు ఉండాలి. ఇలా నిద్రపోతే, చాలా మంచి జరుగుతుంది. ప్రమోషన్ కూడా వస్తుంది, మీరు పని చేసే ఆఫీస్ లో కూడా వీలైనంతవరకు వాస్తు నియమాలని పాటించాలి. ప్రత్యేక క్యాబిన్లో మీరు పని చేస్తున్నట్లయితే, అది చతురస్రాకారంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వలన మీకు కెరియర్లో సమస్యలన్నీ తొలగిపోతాయి.

]]>