Korrala Dosa – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Fri, 28 Jul 2023 12:23:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Korrala Dosa – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Korrala Dosa : కొర్ర‌ల‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దోశ‌.. ఇలా చేయాలి..! https://ayurvedam365.com/news/korrala-dosa-recipe-in-telugu-very-healthy-and-tasty.html Fri, 28 Jul 2023 12:25:55 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=37012 Korrala Dosa : మ‌నం అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. దోశ‌లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా కూడా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఇలాంటి దోశ‌ల‌ల్లో మిల్లెట్ మ‌సాలా దోశ కూడా ఒక‌టి. కొర్ర‌ల‌తో చేసే ఈ దోశ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌సాలా దోశ‌ను ఒక‌టి ఎక్కువే తింటారని చెప్ప‌వ‌చ్చు. త‌ర‌చూ ఒకేరకం దోశ‌లు కాకుండా ఇలా కొర్ర‌ల‌తో కూడా రుచిక‌ర‌మైన దోశ‌లను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ మిల్లెట్ మ‌సాలా దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిల్లెట్ మ‌సాలా దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కొర్ర‌లు – అర క‌ప్పు, బియ్యం – పావు క‌ప్పు, మిన‌ప‌ప్పు – పావు క‌ప్పు, ఇడ్లీ రైస్ – పావు క‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పంచ‌దార – ఒక టీ స్పూన్.

Korrala Dosa recipe in telugu very healthy and tasty
Korrala Dosa

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌కర్ర – అర టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, అల్లం తురుము – ఒక టీ స్పూన్, పొడవుగా స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ఉప్పు -త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉడికించి మెత్త‌గా చేసిన బంగాళాదుంప‌లు – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

మిల్లెట్ మ‌సాలా దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కొర్రెలు, బియ్యం, ఇడ్లీ రైస్, మిన‌ప‌ప్పు, మెంతులు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. తరువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పిండినిగి న్నెలోకి తీసుకుని రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత అందులో పంచ‌దార‌, ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు మ‌సాలా కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మెత్త‌గా చేసుకున్న‌ బంగాళాదుంప‌లు వేసి క‌ల‌పాలి.

వీటిని మ‌రో 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌సాలా త‌యార‌వుతుంది. ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి. త‌రువాత పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. దోశ త‌డి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. త‌రువాత మ‌ధ్య‌లో బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచి దోశ‌ను రోల్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిల్లెట్ మ‌సాలా దోశ త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కొర్ర‌ల‌తో దోశ‌ను త‌యారు చేసుకుని రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

]]>