Lord Ganesha For Vastu – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Wed, 18 Dec 2024 10:03:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Lord Ganesha For Vastu – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Lord Ganesha For Vastu : మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా.. అయితే వినాయ‌కున్ని ఇలా పూజించండి..! https://ayurvedam365.com/vastu/if-your-home-has-vastu-dosham-then-do-pooja-to-lord-ganesha-like-this.html Wed, 18 Dec 2024 10:03:49 +0000 https://ayurvedam365.com/?p=62646 Lord Ganesha For Vastu : ప్రతి ఒక్కరూ, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ వుంటారు. కానీ, అప్పుడప్పుడు ఏదో ఒక సమస్యలు రావడం వంటివి జరుగుతుంటాయి. చాలామంది, వాస్తు దోషాల వలన కూడా ఇబ్బంది పడుతుంటారు. వాస్తు దోషాలు పోగొట్టుకోవడానికి, రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా, వాస్తు దోషంతో బాధపడుతున్నారా..? వాస్తు దోషాలని పోగొట్టుకోవడానికి, వినాయకుడిని ఏ విధంగా పూజించాలి అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక మీరు వినాయకుడిని ఆరాధించినట్లయితే, సుఖసంతోషాలు కలుగుతాయి.

శాంతి. శ్రేయస్సు కూడా కలుగుతుంది. వినాయకుడు ఆశీస్సులు లభించాలన్న, వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా తెల్లటి పూలతో గణేషుడిని పూజించండి. గణేశుడికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే, శుభ ఫలితం ఉంటుంది. అలానే, ఇంటి తలుపులు మీద వినాయకుడు ఫోటోని పెట్టడం మంచిది, కళా రంగంలో కీర్తి కోసం, నాట్య వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే మంచిది. కూర్చున్న భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి.

if your home has vastu dosham then do pooja to lord ganesha like this

అలానే, ఇంట్లో వినాయకుడిని పెట్టేటప్పుడు, వినాయకుడి తొండం ఎడమవైపుకి ఉండే విధంగా ఉన్న విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే మంచిది. అదే తొండం కుడివైపుకి ఉన్నట్లయితే, వాటిని ఆలయంలో ప్రతిష్టించడం మంచిది. ఆఫీసులో ఒత్తిడి వంటివి లేకుండా పనులు పూర్తవ్వాలంటే, వినాయకుడి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవడం మంచిది. వినాయకుడిని ఇంట్లో పెట్టి పూజలు చేస్తే, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

ఇంటి తలుపు ముందు, గుడి, స్తంభం, రహదారి ఇంటి ప్రధాన తలుపుకు సంబంధించి వాస్తు దోషము ఉన్నట్లయితే, ద్వార వేద దోషం అంటారు. ఈ దోషం తొలగిపోవాలంటే, ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలి. ఇలా, ఈ విధంగా మీరు వినాయకుడిని పెట్టడం ఆరాధించడం చేస్తే, అంతా మంచి జరుగుతుంది. వాస్తు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

]]>