Purple Color Foods – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Sun, 28 Jul 2024 14:06:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Purple Color Foods – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Purple Color Foods : ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే వీటిని తింటే.. మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..! https://ayurvedam365.com/health-tips-in-telugu/purple-color-foods-take-these-regularly-to-clean-your-arteries.html Sun, 28 Jul 2024 14:06:46 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=47960 Purple Color Foods : మ‌నం రోజూ పాటించే జీవ‌న‌శైలి కార‌ణంగానే మ‌న‌కు అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. ముఖ్యంగా మ‌నం రోజూ తినే ఆహారం చాలా వ‌ర‌కు వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అలాగే శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోవ‌డం, స‌రిగ్గా నీళ్లు తాగ‌క‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా మ‌నం రోగాల బారిన ప‌డుతుంటాం. అయితే వాస్త‌వానికి ఈ అల‌వాట్లు అన్నీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అయితే ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే మ‌నం ర‌క్త‌నాళాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇందుకు గాను మ‌న‌కు ప‌లు ఆహారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు క్లీన్ అవుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న‌కు అనేక ర‌కాల రంగుల ఆహారాలు లభిస్తుంటాయి. అయితే ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వు క‌ర‌గాలంటే మాత్రం మ‌నం ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తినాలి. వీటిని తింటే కొలెస్ట్రాల్ అన్న‌ది ఉండ‌దు. ఇక అలాంటి వాటిల్లో బ్లూబెర్రీలు ముఖ్య‌మైన‌వి. ఇవి ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో చూసేందుకు అంత ఆకర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వీటిని రోజూ తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ్లూబెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ మ‌న గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వును క‌రిగిస్తాయి. దీంతోపాటు హైబీపీ కూడా త‌గ్గుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

Purple Color Foods take these regularly to clean your arteries
Purple Color Foods

బ్లాక్ బెర్రీలు కూడా పర్పుల్ క‌ల‌ర్ ఫుడ్స్ కింద‌కే వ‌స్తాయి. వీటిని తింటే మ‌న‌కు ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, యాంథో స‌య‌నిన్స్ ల‌భిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్ ఎటాక్ రాదు. ద్రాక్ష పండ్లు కూడా కొన్ని ప‌ర్పుల్ క‌ల‌ర్‌లోనే ఉంటాయి. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ద్రాక్ష‌ల్లో రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపుల‌ను త‌గ్గించి శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

ప్ల‌మ్స్‌లో విట‌మిన్ సితోపాటు పొటాషియం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే హైబీపీ త‌గ్గుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వంకాయ‌ల‌ను కూడా తిన‌వ‌చ్చు. గుండెకు ఇవి కూడా ఎంతో మేలు చేస్తాయి. వంకాయ‌ల్లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది గుండె ప‌నితీరును మెరుగు ప‌రుస్ఉతంది. అలాగే వీటిల్లో ఉండే యాంథో స‌య‌నిన్లు గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి.

ప్రూన్స్ మ‌న‌కు ఎక్కువ‌గా మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. వీటిల్లోనూ ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి జీర్ణ‌క్రియను మెరుగు ప‌రుస్తుంది. అలాగే గుండెను సంర‌క్షిస్తుంది. అందువ‌ల్ల ఈ ఆహారాల‌ను మ‌నం త‌ర‌చూ తింటుంటే ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ర‌క్త‌నాళాలు క్లీన్ అవుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌, ఇత‌ర గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. క‌నుక ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోండి.

]]>
Purple Color Foods : ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తింటే.. ఎన్నో అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..! https://ayurvedam365.com/health-tips-in-telugu/amazing-health-benefits-of-eating-purple-color-foods.html Tue, 01 Mar 2022 11:03:40 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=10432 Purple Color Foods : మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అనారోగ్య‌క‌ర‌మైన‌వి అయితే కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన‌వి ఉన్నాయి. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో మ‌న‌కు ప‌లు ర‌కాల భిన్న రంగుల్లో ఉండే ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆహారాలు ఒక‌టి. ఇలాంటి రంగులో ఉన్న ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of eating Purple Color Foods
Purple Color Foods

1. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల్లో ఆంథోస‌య‌నిన్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి. జీర్ణ స‌మ‌స్య‌లను త‌గ్గిస్తాయి. తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేయ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే ఈ ఆహారాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

2. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. కంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. దీంతో క‌ళ్ల జోడు అవ‌స‌రం ఉండ‌దు. అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

3. జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ఎక్కువ‌గా ఉండేవారు ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తింటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గుతాయి. దీంతో యవ్వ‌నంగా క‌నిపిస్తారు.

4. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కుపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది.

5. మ‌న చ‌ర్మానికి ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వీటి వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. దీంతో చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

6. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌వు. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

]]>