Sorakaya Nuvvula Podi Kura – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Sun, 29 Jan 2023 16:08:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Sorakaya Nuvvula Podi Kura – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Sorakaya Nuvvula Podi Kura : సొర‌కాయ‌ల‌తో నువ్వుల పొడి కూర‌ను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది.. https://ayurvedam365.com/news/sorakaya-nuvvula-podi-kura-recipe-in-telugu-make-in-this-way.html Sun, 29 Jan 2023 16:10:42 +0000 https://ayurvedam365-com.in9.cdn-alpha.com/?p=27185 Sorakaya Nuvvula Podi Kura : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోనాల‌ను పొంద‌వ‌చ్చు. సొర‌కాయ‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. సొర‌కాయ‌తో చేసిన వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. కింద చెప్పిన విధంగా నువ్వుల పొడి వేసి చేసే సొర‌కాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. నువ్వుల పొడిని అలాగే నువ్వుల పొడి వేసి సొర‌కాయ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ నువ్వుల పొడి కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

తరిగిన సొర‌కాయ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్.

Sorakaya Nuvvula Podi Kura recipe in telugu make in this way
Sorakaya Nuvvula Podi Kura

నువ్వుల పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండుమిర్చి – 8, నువ్వులు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4.

సొర‌కాయ నువ్వుల పొడి కూర త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన త‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన త‌రువాత దీనిని ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో వేయించిన నువ్వులు, ఉప్పు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ లో సొర‌కాయ ముక్క‌లు, త‌గినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత ఉడికించిన సొర‌కాయ ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని నీరంతా పోయి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న నువ్వుల కారం 3 టీ స్పూన్ల మోతాదులో వేసి క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే 4 టీ స్పూన్లు కూడా వేసుకోవ‌చ్చు. ఇలా నువ్వుల కారం వేసిన తరువాత దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ నువ్వుల పొడి కూర త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ‌తో అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

]]>