technology

ఐఫోన్ 16, ఐఫోన్ 15.. మ‌ధ్య తేడాలు ఇవే.. ముందు ఇది చ‌దివి త‌రువాత ఫోన్ కొనండి..!

ప్ర‌స్తుతం ఐఫోన్స్‌కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎవ‌రి ద‌గ్గ‌ర చూసిన కూడా ఐఫోన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఐఫోన్ నిర్వాహ‌కులు ఊడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ 16 కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిగా చూస్తున్నారు. అయితే ఈ ఫోన్ తీసుకునేముందు ఒక్క‌సారి ఐఫోన్ 15 ఫోన్‌లో ఉన్న ఫీచ‌ర్స్ ఏంటి, దానికి అడ్వాన్స్‌గా 16లో ఏం వ‌స్తుందో తెలుసుకొని ఐఫోన్ 16ని కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఐఫోన్ 16లో యాపిల్ ఇంటెలిజెన్స్, కెమెరా ఫీచర్స్ వంటివి యాపిల్ లాయల్ కస్టమర్లను ఆకట్టుకుంటాయి, వారు కొత్త డివైస్‌లకు అప్‌గ్రేడ్‌ కావడానికి తోడ్పడతాయి. ఇప్పుడు ఈ ఫోన్ కొనడం యాపిల్ ఫోన్లను అభిమానించేవారికి పెట్టుబడిలాంటిదేనని, ఎందుకంటే రానున్న కాలంలో ఇది మరింత మెరుగుపడుతూనే ఉంటుంది అని అంటున్నారు.

కొత్త కెమెరా డిజైన్ తో ఐఫోన్ 16 మార్కెట్ లోకి వ‌చ్చింది. సిల్హౌట్ ఏమి మార‌దు కాని కాస్త డిజైన్ మార్చారు. ఇక క‌ల‌ర్ విష‌యానికి వ‌స్తే పింక్, టీల్ మరియు అల్ట్రామెరైన్ కలర్ ఆప్షన్‌లను పరిచయం చేసింది. ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 16 మధ్య అతిపెద్ద వ్యత్యాసం AI సామర్థ్యాల పరంగా ఉండవచ్చు. ఐఫోన్ 16 ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు మద్దతు ఇస్తుంది మరియు WWDC 24 కీనోట్‌లో ఆపిల్ ప్రకటించిన దాదాపు అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, ఐఫోన్ 15 ఎప్పటికీ ఆపిల్ ఇంటెలిజెన్స్ లక్షణాలు ఉండ‌వు. ఐఫోన్16 సరికొత్త A18 బయోనిక్ చిప్‌తో వస్తుంది, ఇది మెరుగైన NPU పనితీరు, CPU మరియు GPU పనితీరును అందిస్తుంది. అలాగే, A16 బయోనిక్ చిప్‌తో పోలిస్తే దీని పనితీరు బూస్ట్ గణనీయంగా ఎక్కువగానే ఉంటుంది.

differences between iphone 15 and iphone 16 must read this

ఫాస్టెస్ట్​ మాగ్​ సేఫ్​ ఛార్జింగ్​: ఐఫోన్ 16 సిరీస్ విడుదలతో, ఛార్జింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రధాన వైర్లెస్ ఛార్జింగ్ అప్​గ్రేడ్​ని కంపెనీ ప్రకటించింది. ఐఫోన్ 16కు 25వాట్ , క్యూ2 ఛార్జర్లకు 15వాట్ల వరకు వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని యాపిల్ ప్రకటించింది. దీంతో ఐఫోన్ 16 యూజర్లు వైర్​లెస్​ ఛార్జింగ్ పెట్టినా మంచి ఛార్జింగ్ వేగాన్ని ఆస్వాదించవచ్చు.16లో కెమెరా క్యాప్చర్ బటన్‌తో వస్తుంది, ఇందులో చిత్రాన్ని క్యాప్చర్ చేయడం లేదా వీడియోను రికార్డ్ చేయడం, మోడ్‌లను మార్చడం, జూమ్ ఇన్ లేదా అవుట్ చేయడం మరియు అనేక ఇతర కెమెరా ఫంక్షనాలిటీలు ఉంటాయి. ఐఫోన్ 16 సిరీస్​తో, యాపిల్ కనెక్టివిటీని వై-ఫై 6ఈ నుంఛి వై-ఫై 7 టెక్నాలజీకి అప్​గ్రేడ్ చేసింది. ఇది మెరుగైన స్థిరత్వంతో పాటు వేగవంతమైన డౌన్ లోడింగ్, అప్ లోడింగ్ వేగాన్ని వినియోగదారులకు అందిస్తుంది.

Share
Sam

Recent Posts