నేటి తరుణంలో మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అరచేతిలోనే ప్రపంచంలో నలుమూలలా జరిగే సంఘటనలను లైవ్‌లో చూసే అవకాశం కల్పిస్తోంది. దీంతో ఎవరైనా ఇట్టే దొరికిపోతున్నారు కూడా. సాంకేతిక పరిజ్ఞానం బారిన పడ్డవారు ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ వల్ల అబద్ధాలు చెప్పడం కుదరడం లేదు. ఇందుకు బెస్ట్ ఉదాహరణ వాట్సాపే. అందులో మీకు ఎవరైనా మెసేజ్ పంపితే దాన్ని మీరు చదువుతారు. కానీ దాన్ని చదవలేదని మాత్రం మీరు బుకాయించలేరు. దీంతో అబద్దం చెప్పడం వీలు కావడం లేదు. దీంతోపాటు ఈ ఫీచర్ వల్ల కొందరికి ప్రైవసీ కూడా ఉండడం లేదు. అయితే కింద చెప్పిన విధంగా చిన్న ట్రిక్ పాటిస్తే దాంతో వాట్సాప్‌లో ఈ సమస్య బారి నుంచి బయట పడవచ్చు.
వాట్సాప్‌లో ఎవరైనా మీకు మెసేజ్ పంపితే దాన్ని మీరు చదివితే అవతలి వారికి మీరు ఆ మెసేజ్‌ను చదివినట్టు చాట్ విండోలో బ్లూ టిక్ కనిపిస్తుంది. దీంతో వారు పంపిన మెసేజ్‌ను మీరు చదివారని వారికి అర్థమవుతుంది. అయితే ఈ బ్లూ టిక్ ఆప్షన్ ను వాట్సాప్‌లో డిజేబుల్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్‌లో మెసేజ్ రాగానే నోటిఫికేషన్ ప్యానెల్‌ను స్ర్కోల్ డౌన్ చేసి ఎరోప్లేన్ మోడ్‌ను ఆన్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్‌లోకి వెళ్లి మెసేజ్ చదవాలి. వాట్సప్ క్లోజ్ చేయాలి. మళ్లీ ఎరోప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేయాలి. ఆఫ్‌లైన్‌లో మీరు వాట్సాప్‌ను ఓపెన్ చేసి మెసేజ్ చదివితే పంపిన వారికి మీరు చదివిన విషయం తెలియదు. బ్లూటిక్స్ కనిపించవు.
అయితే వాట్సాప్‌ను పూర్తిగా క్లోజ్ చేసి ఎరోప్లేన్ మోడ్‌ను ఆన్ చేయాలి. సింపుల్‌గా బ్యాక్‌బటన్ నొక్కి క్లోజ్ అయింది అనుకుంటే సరిపోదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ యాప్ రన్ అవుతుంటే సింక్రనైజ్ అయి బ్లూటిక్స్ కనిపించే అవకాశం ఉంటుంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లో అకౌంట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. అందులో చివర ఉండే రీడ్ రెసీప్ట్స్(Read receipts) అనే ఆప్షన్ దగ్గర టిక్ మార్క్‌ను తీసేయండి. దీంతో అవతలివాళ్లకు మీరు చదివినట్లు బ్లూటిక్స్ కనిపించవు. ఇలా కూడా వాట్సాప్‌లో బ్లూ టిక్స్ రాకుండా చూడవచ్చు.