technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

వికీమీడియా ఫౌండేషన్ పాత లాప్ టాప్ లను ఏం చేస్తుంది అన్నది తెలుసు నాకు. వికీమీడియా ఫౌండేషన్ కంపెనీ కాదు, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష రహిత సంస్థల్లో ఒకటి. అయితే, టెక్నాలజీ కంపెనీల స్థాయిలో ఊహించేందుకు వీల్లేదు దీని స్కేలు. ఉన్నది ఒకే ఆఫీస్, అది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. ఓ 300 మంది వరకూ ఉద్యోగులు ఉంటారు దీనికి. వాళ్ళూ లాప్టాప్ మారుస్తూ ఉంటారు. వికీమీడియా ఫౌండేషన్ అన్నదే వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టులను నిర్వహించి, అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక వికీమీడియన్లు కనీస సౌకర్యాలు కూడా నోచుకోని స్థితిలో ఉండి వికీమీడియా ప్రాజెక్టుల ద్వారా విజ్ఞానాన్ని కనీసం తమ క్రెడిట్ కూడా నేరుగా పేజీల్లో లేకుండా పంచుతారు.

కనుక, ఫౌండేషన్లో ఉద్యోగి, చాలా అనుభవజ్ఞుడైన వికీపీడియన్ అయిన అసఫ్ బర్తోవ్ ఓ ప్రాజెక్టు ప్రారంభించాడు. దాని ప్రకారం, ఈ వాడిన లాప్టాపులను కనీసం ఓ లాప్టాప్ కూడా లేని, ఎంతో కృషిచేసిన వికీమీడియన్లకు అందిస్తారు. దీని పేరు హార్డ్ వేర్ డోనేషన్ ప్రోగ్రామ్. లాప్ టాప్ అవసరమైన వికీపీడియన్లు పబ్లిగ్గా దరఖాస్తు చేసుకోవచ్చు. అసఫ్ బార్తోవ్ కానీ, ఇతర వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగి కానీ పరిశీలించి ఆమోదించడమో, తిరస్కరించడమో చేస్తారు. ఆమోదం పొందిన దరఖాస్తు దారులకు వారు నివసించే ప్రాంతానికి చెందిన వికీపీడియన్లు ఏదైనా అంతర్జాతీయ కాన్ఫరెన్సుకు వెళ్తే వారికి ఫౌండేషన్ ఉద్యోగి అమెరికా నుంచి తెచ్చిన లాప్టాపుల్లో ఒకటి ఇచ్చి పంపుతారు.

what happens to the laptops used by google

ఉదాహరణకు నేను వికీమీడియా సమ్మిట్ కోసం జర్మనీ వెళ్ళినప్పుడు అసఫ్ నాకొక లాప్ టాప్ ఇచ్చి గుంటూరులో ఉన్న వికీపీడియన్ ఒకరికి అందజేయమని అడిగాడు. నేను తెచ్చి ఇచ్చాను. చివరకు, ఆ లాప్ టాప్ లబ్ధిదారులకు చేరుతుంది. ఒక యూనివర్సల్ ఛార్జర్, ఉబంటు ఉన్న లాప్టాప్ లబ్ధిదారులు అందుకుంటారు. అదేమంత అద్భుతంగా ఉండదని నేను చెప్పగలను. కానీ, అసలు ఏ లాప్ టాప్ లేకుండా ఇబ్బంది పడే వికీపీడియన్ల అవసరానికి మాత్రం ఉపయోగపడుతుందన్న దానిలో సందేహం లేదు. 2017లో వికీమీడియా ఫౌండేషన్ నుంచి ఆఫ్రికాకు చెందిన ఐవరికోస్ట్ దేశపు వికీపీడియన్ అందుకున్న మాక్ బుక్ ప్రో ఇది.

Admin

Recent Posts