మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు, ముందుగా ఆ ఫోన్ నెంబర్ పది అంకెలు ఉందా? లేదా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాము కదా! అయితే ఇండియాలో ఫోన్ నెంబర్లకు +91 అని ఎందుకు ఉంటుంది… అని ఎప్పుడయినా ఆలోచించరా? అలా ఉండడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఇండియాలో ఫోన్ నెంబర్లకు ముందు ప్లస్ +91 ఉంటుందని మన అందరికీ తెలుసు. అలా ఎందుకు ఉంటుంది. +9, +8, +7 అని ఎందుకు ఉండదు. 1960 సంవత్సరంలో (ITU) ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ అనే సంస్థ ఇండియాకి +91 అనే కోడ్ ని ఇచ్చారు.
ITU డిపార్ట్మెంట్ అనేది ఒక్కో దేశానికి ఒక్కో కోడ్ ను ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలతో కలిపి చూస్తే వీటిని కొన్ని జోన్లుగా విభజించారు. దీనిలో మన ఇండియా తొమ్మిదవ జోన్. అయితే 9 జోన్లలో కూడా నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇండియాకి తొమ్మిదవ జోన్ కాబట్టి 9 ని ఇచ్చారు. మిగతా 1 ఎందుకంటే ఇండియా 9వ జోన్ లో నాలుగు దేశాలు ఉన్నాయి. దానిలో మొదటి స్థానం ఇండియాది. అందువల్ల ఇండియాది మొదటి స్థానం కాబట్టి ఒకటిని ఇచ్చారు. అందుకే + 91 అనే కోడ్ ని ఇండియా వాడుతుంది.