ఎంతో ఖరీదు పెట్టి కొనే ఫోన్లను కాపాడుకునేందుకు చాలా మంది మొబైల్ కేసెస్‌ను ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల ఫోన్లకు రక్షణ లభిస్తుంది. ఫోన్లపై గీతలు పడకుండా ఉంటాయి. ఫోన్ కింద పడ్డా పెద్దగా నష్టం కలగకుండా ఉంటుంది. అయితే చాలా మంది సిలికా కేస్‌లను ఉపయోగిస్తుంటారు. ఆరంభంలో అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ అవి పసుపు రంగులోకి మారుతాయి. ఇలా అవి ఎందుకు మారుతాయో చాలా మందికి తెలియదు.
మొబైల్ ఫోన్లకు వాడే సిలికా కేస్‌లు మొదట కొన్నప్పుడు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ అవి పసుపు రంగులోకి మారుతాయి. ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల అలా జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ కారణం అది కాదు.
సిలికా కేస్‌లను సిలికా జెల్, ప్లాస్టిక్ పాలిమర్స్‌తో తయారు చేస్తారు. అందువల్ల అవి సులభంగా పసుపు రంగులోకి మారుతాయి. పాలిమర్స్ కాలం గడిచే కొద్దీ పసుపు రంగులోకి మారుతాయి. రోజూ అవి కాంతి, వేడి, ఇతర రసాయనాలకు ప్రభావితం అవుతాయి. అందుకనే పసుపు రంగులోకి మారుతాయి. అంతేకానీ.. రేడియేషన్ వల్ల కాదు. సిలికా కేస్ రంగు మారితే ఇంకోటి కొనుక్కోండి. కానీ రేడియేషన్ వల్ల రంగు మారిందని భయపడాల్సిన పనిలేదు.