ఇంగ్లాండు లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్ధ మాట్లాడే అన్నం ప్లేటును ప్రవేశపెట్టిందట. దీని ఖరీదు 1500 పౌండ్లు మాత్రమే. ఈ అన్నం ప్లేటులో ఆహారం పెట్టుకొని త్వర త్వరగా తిన్నామా?.. చాలా నిదానంగా తిను బాబూ అంటుందట. దీనిని స్వీడన్ దేశ సైంటిస్టులు కనిపెట్టారు. లండన్ లో వందలాది కుటుంబాలు తమ అధిక బరువు తగ్గించుకోడానికి ఈ ప్లేటు ఉపయోగిస్తున్నారట. ఈ పరికరం రెండు భాగాల్లో వుంటుంది. ఒకటి తినే ప్లేటు కింద ఒక స్కేలు రెండోది ప్లేటులోని ఆహారం తింటూ వుంటే.. ఎంత తిన్నారో దానిని ఒక స్క్రీన్ పై చూపుతుంది.
స్క్రీన్ పై గల రెడ్ లైన్…తినే వేగాన్ని, బ్లూ లైన్ సరైన విధంగా తింటున్నారని సూచిస్తుంది. స్క్రీన్ పై ఇంకా తినాలని ఉన్నదా? లాంటి ప్రశ్నలు కూడా కనపడతాయట. స్క్రీన్ ని లెక్కపెట్టకుండా తినేస్తూ వుంటే…దానిలో కంప్యూటర్ ఇక తిన్నది చాలు అనికూడా నోటితోనే చక్కగా అందరికి వినపడేలా చెప్పేస్తుందట.
ప్లేటుకు పెట్టిన ఈ పరికరాన్ని మేండో మీటర్ అని చెపుతారని , దీనిని ఉపయోగించి అనేక కుటుంబాలు 12 నుండి 15 శాతం ఆహారం తక్కువగా తిని తమ ప్రాజెక్టు విజయవంతం చేస్తున్నారని కుటుంబంలోని వ్యక్తులు బరువు తగ్గుతున్నారని బ్రిస్టల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జూలియన్ హేమిల్టన్ షీల్డ్ తెలిపారు.