Kanuga Chettu Benefits : మొటిమలు, గజ్జి, తామర, దురద.. ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు అయినా స‌రే ఈ చెట్టుతో న‌యం చేసుకోవ‌చ్చు..

Kanuga Chettu Benefits : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. మ‌న దేశంలో ఎన్నో ఏళ్లుగా ఈ మొక్క‌ల‌ను ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఇలా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల్లో కానుగ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు తెలియ‌ని వారుండ‌రనే చెప్ప‌వ‌చ్చు. వేప చెట్టు లాగా కానుగ కూడా ప‌ర్య‌వ‌ర‌ణాన్ని శుద్ధి చేయ‌డంలోనూ, పంట‌లకు ప‌ట్టిన చీడ‌పీడ‌ల‌ను న‌శింప‌జేయ‌డంలోనూ, శ‌రీరాన్ని అంటు వ్యాధుల నుండి అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి కాపాడ‌డంలోనూ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ఈ చెట్టు లేని ఊరు ఎక్క‌డ ఉండ‌నే ఉండ‌దు అని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. కానుగ చెట్టు వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీనిని సంస్కృతంలో క‌రన్జ‌క‌, స‌ప్త‌మాల అని, హిందీలో క‌ర‌న్జా అని పిలుస్తారు. ఈ చెట్ల‌ను రోడ్డుకు ఇరువైపులా, ఇళ్ల ముందు, పార్క్ ల‌ల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో పెంచ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం. దీనిని ఎక్కువ‌గా చ‌ల్లని నీడ కోసం పెంచుతూ ఉంటారు. ఇది చ‌ల్ల‌ని నీడ ఇవ్వ‌డ‌మే కాదు మ‌న‌కు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన గాలిని కూడా ఇస్తుంది. అలాగే ఈ చెట్టు 6 నుండి 12 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. కొన్ని కానుగ చెట్లు 25 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు కూడా పెరుగుతాయి. కానుగ పూలు చూడ‌డానికి గుత్తులు గుత్తులుగా నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. అదే విధంగా కానుగ కాయ‌లను ప‌గ‌ల‌కొట్టి వాటిలో ఉండే గింజ‌ల‌తో ఎన్నో ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. అంతేకాకుండా ఈ గింజ‌ల నుండి నూనెను కూడా తీస్తారు. ఈ నూనెను ఆహారంగా తీసుకోరు కానీ దీనితో అనేక ఉప‌యోగాలు ఉన్నాయి. కానుగ చెట్టు ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.

Kanuga Chettu Benefits in telugu use it in these ways for health problems
Kanuga Chettu Benefits

కానుగ చెట్టును ఏవిధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కానుగ చెట్టు ఆకుల‌ను, జిల్లేడు ఆకుల‌ను, జాజి చెట్టు ఆకుల‌ను స‌మానంగా తీసుకుని గోమూత్రంతో క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న చోట రాయ‌డం వ‌ల్ల స‌మ‌స్త చ‌ర్మ రోగాలు తొల‌గిపోతాయి. మూత్రపిండాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు 3 గ్రాముల కానుగ గింజ‌ల ప‌ప్పును, 50 గ్రాములు ఆవు పాలల్లో క‌లిపి తాగుతూ ఉంటే మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌తో పాటు మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. కానుగ గింజ‌ల ప‌ప్పును 10 గ్రాముల మోతాదులో తీసుకుని వాటికి 10 గ్రాముల పిప్పిళ్ల‌ను, 5 గ్రాముల తుమ్మ జిగురును క‌లిపి మెత్త‌గా నూరాలి. త‌రువాత వీటిని శ‌న‌గ గింజ‌లంత ప‌రిమాణంలో మాత్ర‌లుగా చేసుకుని గాలికి ఆర‌బెట్టాలి. ఇలా త‌యారు చేసుకున్న మాత్ర‌ల‌ను జ్వ‌రం వ‌చ్చిన వారు మూడు పూట‌లా పూట‌కు ఒక మాత్ర చొప్పున గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల జ్వ‌రాలు మూడు నుండి నాలుగు రోజుల్లోనే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. కానుగ గింజ‌ల ప‌ప్పును పొడిగా నిల్వ చేసుకోవాలి. పిల్ల‌లు కోరింత ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో తేనెతో క‌లిపి ఇవ్వ‌డం వ‌ల్ల ద‌గ్గు త‌గ్గ‌తుంది. పురుషుల్లో వ‌చ్చే వృష‌ణాల వాపు స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో కూడా కానుగ చెట్టు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. కానుగ గింజ‌ల పప్పును, ఆముదం గింజ‌ల ప‌ప్పును, గిజ్జ కాయ‌ల పప్పును స‌మ‌పాళ్ల‌ల్లో తీసుకుని వంట ఆముదంతో క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని వృష‌ణాల పై రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మస్య నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. పిల్ల‌ల్లో వ‌చ్చే కంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కానుగ కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ కాయ‌ల‌ను ఒక న‌ల్ల దారానికి దండ‌లా గుచ్చి పిల్ల‌ల మెడ‌లో వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో వ‌చ్చే కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

అలాగే వారికి అంటు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. రెండు గ్రాముల కానుగ గింజ‌ల ప‌ప్పు పొడిలో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, గొంతులో నొప్పి, గొంతులో మంట‌, కోరింత ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కానుగ చెట్టు పూల‌ను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూట‌కు మూడు గ్రాముల మోతాదులో గోరు వెచ్చని నీటితో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అతి మూత్ర వ్యాధి, మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ లు వంటి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కానుగ చెట్టు బెర‌డును మెత్త‌గా నూరి దాని నుండి ర‌సాన్నితీయాలి. ఈ ర‌సానికి స‌మానంగా వంట ఆముదాన్ని క‌లిపి చిన్న మంట‌పై కేవ‌లం నూనె మిగిలే వ‌ర‌కు వేడి చేయాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను ప‌క్ష‌వాతంతో ప‌డిపోయిన చేతులు, కాళ్లతో పాటు ఇత‌ర శ‌రీర భాగాల‌పై రాసి మ‌ర్దనా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌డిపోయిన కాళ్లు, చేతులు కూడా ప‌ని చేస్తాయి.

అయితే ఈ నూనెను వాడే ప్ర‌తిసారి అది గోరు వెచ్చ‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే కానుగ గింజ‌ల ప‌ప్పును నెయ్యితో వేసి అవి న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఈ నెయ్యిని వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నెయ్యిని 3 నుండి 4 చుక్క‌ల మోతాదులో చెవిలో వేసుకోవ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల చెవి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా కానుగ చెట్టు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts