Pala Pandlu : మనకు సహజ సిద్దంగా లభించే కొన్ని రకాల పండ్లల్లో పాల పండ్లు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా మనకు ఏప్రిల్, మే నెలల్లో లభిస్తాయి. ఈ పండ్లు మనకు అడవుల్లో ఎక్కువగా లభిస్తాయి. ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా ఈ పాల పండ్లు మనకు లభిస్తాయి. పాల పండ్ల చెట్లు 40 నుండి 80 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ చెట్ల బెరడు బూడిద నలుపు రంగుగా ఉండి గరుకుగా ఉంటుంది. వీటి శాస్త్రీయ నామం మనిల్ కరా హెగ్జాండ్రా. ఈ పండ్లు మన దేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండో చైనా, నేపాల్, వియత్నాం వంటి దేశాల్లో కూడా విరివిరిగా లభిస్తాయి.
ఈ పండ్లల్లో పాలు ఉంటాయి. కనుక ఈ పండ్లను పాలపండ్లు అంటారు. ఈ పాలు తియ్యగా ఉంటాయి. ఈ పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాల పండ్లల్లో విటమిన్ సి, కెరోటనాయిడ్స్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ ఎ, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎంతో శక్తి లభిస్తుంది. పిల్లలకు ఈ పండ్లను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తం శుద్ది అవుతుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి పూత తగ్గడంతో పాటు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ పాల పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇవి లభించే కాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల సంవత్సరమంతా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. పాల పండ్లను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పురుషులు ఈ పాల పండ్లను తినడం వల్ల లైంగిక సమస్యలు తగ్గడంతో పాటు లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పాలపండ్ల చెట్ల కలప చాలా ధృడంగా ఉంటుంది. ఈ కలపతో వివిధ రకాల ఫర్నీచర్ ను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ విధంగా పాలపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.