Ravi Chettu Benefits : చెట్లను పూజించే సంప్రదాయాన్ని మనం భారత దేశంలో ఎక్కువగా చూడవచ్చు. మనం పూజించే రకరకరాల చెట్లల్లో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టుకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీని శాస్త్రీయ నామం ఫైకస్ రెలిజియోసా. హిందీలో రావి చెట్టును పీపల్ అని పిలుస్తారు. రావి చెట్టు ఎంతో పవిత్రతో పాటు ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. ఆయుర్వేదంలో కడా రావి చెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు. రావి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధాలు దాగి ఉన్నాయి. రాగిచెట్టులోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రావి చెట్టు వచ్చే గాలి కూడా ఎంతో శ్రేష్టమైనది. దీనిని గాలిని పీల్చినా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. రాగి చెట్టు చిగుర్లను పాలల్లో ఉడికించి వడకట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. ఈ చెట్టు పండ్లను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే రావి పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్లు, దంతాల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. దంతాలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. రాగి పండ్లను నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా పటిక బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతో పాటు వీర్య వృద్ధి కూడా చెందుతుంది.

ఈ పొడిని తీసుకుంటూ రాగి పాలను పాదాలకు రాయడం వల్ల పాదలపగుళ్లు తగ్గుతాయి. రావి చెట్టు వేర్ల దగ్గర ఉండే మట్టిని సేకరించి శుభ్రం చేసుకుని పొడిగా చేసి జల్లించి మెత్తని మట్టిని సేకరించాలి. ఈ మట్టిని స్నానం చేసేటప్పుడు నలుగుగా ఉపయోగిస్తూ ఉంటే చర్మం అందంగా, మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉండే ముడతలు తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవుతుంది. రావి పాలతో కాటుకను తయారు చేసి కళ్లకు పెట్టుకోవడం వల్ల కళ్ల సంబంధిత సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు అలాగే గుండె బలహీనంగా వారు రావి పండ్ల పొడిని 5 గ్రాముల మోతాదులో తీసుకుని రెండు కప్పుల పాలల్లో వేసి కలపాలి. తరువాత ఈ పాలను సన్నని మంటపై మూడు పొంగులు వచ్చే వరకు మరిగించాలి. తరువాత ఈ పాలల్లో కండ చక్కెర పొడిని కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా 40 రోజుల పాటు తీసుకోవడం వల్ల గుండె బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. రావి ఆకుల పొడిని 3 గ్రాముల మోతాదులో తీసుకుని నీళ్లల్లో కలిపి తీసుకోవడం వల్ల ఆస్థమా వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. నాలుగు ఆకులను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని పావు లీటర్ నీటిలో వేసి కలపాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగుతూ ఉంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
పాము కాటుకు గురి అయినప్పుడు రెండు లేదా మూడు టీ స్పూన్ల రావి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. రావి చెట్టు ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల తామర వంటి చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కడుపు నొప్పితో బాధపడే వారు 5 రావి ఆకులను సేకరించి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ కు బెల్లాన్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను రోజుకు మూడు లేదా నాలుగు తీసుకుంటే ఉంటే కడుపునొప్పి తగ్గుతుంది. రాగి పండ్లను తినడం వల్ల దగ్గు, వాంతులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు, తలనొప్పి, తెల్లజుట్టు వంటి సమస్యలను కడా రావి చెట్టును ఉపయోగించి తగ్గించుకోవచ్చు.
అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు రావి చెట్టు ఆకులను ఇంటి తోరణంగా కట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత కూడా నెలకొంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే సంతానం లేని స్త్రీలు రావిచెట్టు దగ్గరికి వెళ్లి నమస్కరించి ప్రదక్షిణ చేయాలి. తరువాత రావి పండ్లను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని వస్త్ర గులితం చేసి దానికి సమానంగా సటిక బెల్లం పొడిని కలిపి గాజు సీసాలో వేసి భద్రపరుచుకోవాలి.
ఈ పొడిని బహిష్టు స్నానం చేసిన నాలుగవ రోజు నుండి వరుసగా 14 రోజుల పాటు ఒక టీ స్పూన్ మోతాదులో ఒక కప్పు ఆవు పాలల్లో కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నుండి మూడు నెలల పాటు చేయడం వల్ల గర్భసంబంధిత దోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. ఈ విధంగా రావి చెట్టు మనకు ఎంతగానో మేలు చేస్తుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య, ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.