Rela Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే చెట్టు ఇది.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Rela Chettu : మెట్ట ప్రాంతాల‌లో, కొండ‌లు, గుట్ట‌ల‌పై, రోడ్డుకు ఇరు ప‌క్క‌లా ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లో రేల చెట్టు కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రేల చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేల చెట్టు క‌షాయం చేదుగా ఉండి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో ఈ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మ రోగాల‌ను, క‌ఫ రోగాల‌ను, క్రిమి రోగాల‌ను, విషాన్ని హ‌రించ‌డంలో కూడా ఈ చెట్టు స‌హాయ‌ప‌డుతుంది.

రేల చెట్టు బెర‌డును దంచి దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా తాగుతూ ఉంటే మూత్రం నుండి ర‌క్తం ప‌డ‌డం త‌గ్గుతుంది. రేల పువ్వుల‌ను ఇత‌ర దినుసుల‌తో క‌లిపి ప‌చ్చ‌డిగా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డి ఎంతో రుచిగా ఉంటుంది. జ్వ‌రం త‌గ్గిన వారు ప‌థ్యంగా ఈ ప‌చ్చ‌డిని తిన‌వచ్చు. రేల పువ్వుల‌తో చేసిన ప‌చ్చ‌డిని తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గి సుఖ విరేచ‌నం అవుతుంది. రేల చెట్టు చిగుళ్ల‌ను సేక‌రించి వాటిని బియ్యం క‌డిగిన నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని కుష్టు వ‌ల్ల క‌లిగిన పుండ్ల‌పై ఉంచుతూ ఉంటే క్ర‌మంగా ఆ పుండ్లు మానిపోతాయి.

Rela Chettu uses are very wonderful know the benefits
Rela Chettu

రేల చెట్టు బెర‌డును, చింత చెట్టు బెర‌డును, ఉప్పును, ప‌సుపును స‌మ‌పాళ్ల‌లో తీసుకుని పొడిగా చేసి వీట‌న్నింటినీ క‌లిపి రోజుకు 50 గ్రాముల మోతాదులో తీసుకుని నీటిలో క‌లిపి ప‌శువుల‌కు తాగించ‌డం వ‌ల్ల ప‌శువుల‌లో క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతుంది. రేల చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు వేరును సేక‌రించాలి. ఈ వేరును తేనెతో క‌లిపి మెత్త‌గా నూరి ఆ గంధాన్ని పూట‌కు మూడు గ్రాముల మోతాదులో మూడు పూట‌లా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వ‌స్తుంది. రేల చెట్టుకు మున‌క్కాయ‌ల మాదిరి కాయ‌లు ఉంటాయి. ఈ కాయ‌ల‌లో న‌ల్ల‌ని గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జును 10 గ్రాముల మోతాదులో సేక‌రించి ఆ గుజ్జును అర లీట‌ర్ నీటిలో వేసి నాలుగో వంతు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. ఈ క‌షాయాన్ని రోజుకు ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల‌లో పేరుకుపోయిన క‌ఫం తొల‌గిపోయి ఉబ్బ‌సం వ్యాధి త‌గ్గుతుంది.

చ‌ర్మ రోగాలు ఉన్న వారు ముందుగా రోగం ఉన్న చోట గోరు వెచ్చ‌ని నువ్వుల నూనెను రాసి ఆ తరువాత రేల చెట్టు, కామంచి, బుడ్డ కాశ ఆకుల‌ను స‌మానంగా తీసుకుని వాటిని నీటితో క‌లిపి నూరి ఆ ముద్ద‌ను న‌లుగు పెట్టిన‌ట్టు చ‌ర్మానికి రుద్ది ఎండిన త‌రువాత వేపాకు వేసి కాచిన నీటితో స్నానం చేస్తూ ఉంటే శ‌రీరం అంతా పాకిన చ‌ర్మ రోగం ఏద‌యినా స‌రే హ‌రించుకు పోతుంది. రేల చెట్టు ఆకుల‌ను ముద్ద‌గా నూరి ఆ ముద్ద‌ను రాత్రి ప‌డుకునే ముందు వాపుల‌పైన‌, తీపుల‌పైన ఉంచి క‌ట్టు క‌ట్టి ఉద‌యాన్నే తీసి వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గుతుంది. రేల చెట్టు వేరును బియ్యం క‌డిగిన నీటితో క‌లిపి నూరి ఆ గంధాన్ని గొంతు చుట్టూ రాయాలి. అలాగే ఆ మిశ్ర‌మాన్ని ముక్కులో వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతు చుట్టూ ఏర్ప‌డ్డ గ‌డ్డ‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో రేల చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts