Tamarind Leaves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే చింత పండును ఉపయోగిస్తున్నారు. చింత పండును అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. చింతపండును చారు, రసం, పప్పు, పులుసు, కుర్మా.. వంటి వాటిల్లో వేస్తారు. దీంతో ఆయా వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే చింత పండు మాత్రమే కాకుండా చింత ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి గురించి ఆయుర్వేదంలోనూ చెప్పబడింది. పలు ఔషధాల తయారీలోనూ చింత ఆకులను ఉపయోగిస్తారు. చింత ఆకులతో మనం పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. చింత ఆకుల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత ఆకుల నుంచి రసం తీసి రోజూ పరగడుపునే తాగవచ్చు. ఇలా తాగడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మధుమేహం నుంచి బయట పడవచ్చు కూడా. అలాగే కామెర్లు కూడా తగ్గుతాయి. కొందరు కామెర్ల చికిత్సకు చింత ఆకులను కూడా ఉపయోగిస్తుంటారు. దీంతో లివర్ శుభ్రపడుతుంది. అందులో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇక ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల మలేరియా వంటి విష జ్వరాలు కూడా తగ్గుతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య తగ్గుతుంది.
బాలింతలు చింత ఆకులను తినడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతో పసికందులకు పాలకు లోటు ఉండదు. అలాగే ఈ ఆకులను తీసుకుంటే మహిళలకు రుతు సమయంలో ఉండే నొప్పులు, ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. కాలిన గాయలతోపాటు ఇతర గాయాలు, దెబ్బలు, పుండ్లను మానేలా చేయడంలోనూ చింత ఆకులు ఉపయోగపడతాయి. వీటిని డికాషన్‌లా చేసి తీసుకోవచ్చు. లేదా ఆకులను మెదిపి పేస్ట్‌లా చేసి సమస్య ఉన్న ప్రదేశంలో రాయవచ్చు. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
జనన అవయవాల దగ్గర ఇన్‌ఫెక్షన్లు, దురద వంటి సమస్యలు ఉన్నవారు చింత ఆకులను ఉపయోగించవచ్చు. దీంతో సమస్య తగ్గుతుంది. అలాగే ఈ ఆకులతో కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. అందుకు గాను చింత ఆకులకు కాస్త ఆముదం రాసి వేడి చేయాలి. అనంతరం వాటిని నొప్పులు, వాపులు ఉన్న చోట వేసి కట్టు కట్టాలి. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చింత ఆకులు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. కనుక చింత ఆకులు కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. ఎన్నో విధాలుగా లాభాలు పొందవచ్చు.