Vepa Chettu : వేప చెట్టులో దాగి ఉన్న గొప్ప ఔషధ గుణాలు ఇవే.. ఎన్నో వ్యాధులను ఇలా నయం చేసుకోవచ్చు..!

Vepa Chettu : పూర్వకాలంలో ఎక్కడ చూసినా మనకు వేప చెట్లు ఎక్కువగా కనిపించేవి. కానీ కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నేటి తరుణంలో వేప చెట్లు కాదు కదా.. వేప మొక్కలు కూడా చూద్దామన్నా కనిపించడం లేదు. ఊరికి కనీసం ఒక వేప చెట్టు అయినా సరే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఆ చెట్టులో ఉండే ఔషధ గుణాలు అద్భుతమైనవి. అందుకని వేప చెట్టును తప్పనిసరిగా ఇళ్లలో పెంచుకునేవారు. అయితే ఇప్పుడు మనకు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కానీ వేప చెట్టు కనిపస్తే ఇకపై దాన్ని విడిచిపెట్టకండి. దాంతో ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. అందులో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేప చెట్టు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను మెత్తగా నూరి కట్టు కడుతుంటే ఎంతో కాలంగా మానని మొండి గాయాలు, పుండ్లు, కురుపులు సైతం మానిపోతాయి. వేపాకుల్లో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. అలాగే వేప చిగుళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా తింటుంటే రక్తం శుద్ధి అవుతుంది. శరీరంపై ఉండే నల్లని మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.

Vepa Chettu benefits in telugu how to use its parts for various diseases
Vepa Chettu

వేప చిగుళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తింటుంటే కొంత కాలానికి అవి చేదుగా కాక తియ్యగా అనిపిస్తాయి. వారికి పాము కరిచినా విషం ఎక్కదు. వేప చెక్క గంధాన్ని శరీరంపై రాసుకుంటుంటే చర్మంపై వచ్చే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. శరీరం పేలినట్లు ఉండడం, దురదలు, శోభి, మంగు, తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ముదురు వేప చెట్టు వేరు చూర్ణం కొద్ది మోతాదుగా లోపలికి తీసుకుంటుంటే రక్తం శుభ్రంగా మారుతుంది. శరీరానికి పుష్టి కలిగిస్తుంది. జ్వరం తగ్గుతుంది. క్రిములు నాశనం అయిపోతాయి. దీంతో విష జ్వరాలు సైతం తగ్గిపోతాయి.

వేప చెక్క చూర్ణాన్ని పసి పిల్లలకు ఇస్తుంటే వారి పొట్టలో ఉండే ఏలికపాములు, నులి పురుగులు చనిపోతాయి. దీంతో కడుపు నొప్పి ఉండదు. వేప చెక్క చూర్ణాన్ని పెద్దలు సేవిస్తుంటే అజీర్తి తగ్గుతుంది. దీంతోపాటు వచ్చిన జ్వరం కూడా తగ్గిపోతుంది. అలాగే వేప చెట్టు వేరు, బెరడు, ఆకు, ఈనె, పువ్వు, పిందె, కాయ, పండు, కళ్లు, జిగురు, నూనె ఇవన్నీ అనేక వ్యాధులను తగ్గిస్తాయి. వేపాకు, పువ్వును తీసుకుంటుంటే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. ఆకలి పెరుగుతుంది. వేపాకు రసాన్ని సేవిస్తుంటే జ్వరం, అజీర్తి, బలహీనత, గండమాల, వ్రణాలు, కుష్టు మొదలైనవి నశిస్తాయి.

వేపాకును పేస్ట్‌ చేసి తలకు కట్టులా కడుతుంటే తలనొప్పి తగ్గుతుంది. న్యూరాల్జియా అనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేపాకును పేస్ట్‌లా చేసి దాన్ని తలకు రాస్తుంటే పేలు, చుండ్రు, ఫంగస్‌ వంటివి నశిస్తాయి. చీము కారు పుండ్లకు వేపాకు నూరి ముద్ద చేసి కడుతుంటే ఆ పుండ్లు త్వరగా మానిపోతాయి. వేప బెరడు, వేప ఈనెల కషాయం రోజు మార్చి రోజు సేవించిన జ్వరం తగ్గుతుంది. వేపాకులపై ఆముదం వేసి వేడి చేసి కట్టు కడుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. లేత వేప చెట్టు నుంచి తీసిన కల్లు తియ్యగా ఉంటుంది. దీన్ని పులియబెట్టి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. అలాగే క్రిములు నశిస్తాయి. ఆకలి పెరుగుతుంది.

వేప కల్లు క్షయ, కుష్టు మొదలైన రోగాలను కూడా తగ్గిస్తుంది. వేప విత్తనాల నూనె చేదుగా ఉంటుంది. దీన్ని సేవిస్తుంటే వాతం హరించుకుపోతుంది. కానీ ఉద్రేకం పుట్టిస్తుంది. వేడి పెంచుతుంది. కనుక తక్కువగా తీసుకోవాలి. వేప నూనె చర్మవ్యాధులను తగ్గిస్తుంది. వేప నూనె, ఆవనూనె, కొబ్బరినూనెలను సమ భాగాల్లో తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ల నొప్పులకు, వాపులకు, తలనొప్పికి ఉపయోగించవచ్చు. వేప జిగురును పైపూతగా రాయడం వల్ల సడలిపోయిన నరాలు బిగువుగా మారుతాయి. వేపాకు కషాయంతో పుండ్లను కడుగుతుంటే అవి త్వరగా మానిపోతాయి.

వేప చెట్టు గాలి రోజూ తగులుతుంటే కలరా, మశూచి వంటి వ్యాధులు రావు. వేప ఆకులను ఎండ బెట్టి బియ్యంలో కలపాలి. బియ్యానికి పురుగులు పట్టవు. ఇలా వేప చెట్టుకు చెందిన ప్రతిభాగంతోనూ మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కనుక వేప చెట్లను అంత తేలిగ్గా తీసుకోకండి. ఈసారి వేప చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా దాని భాగాలను ఇంటికి తెచ్చుకుని వాడండి. దీంతో అనేక లాభాలు పొందవచ్చు.

Share
Editor

Recent Posts