Virigi Chettu Benefits : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్నో లాభాలు ఉంటాయి.. ముఖ్యంగా పురుషుల‌కు..

Virigi Chettu Benefits : విరిగి చెట్టు.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని విరిగి పండ్ల చెట్టు, న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర కాయ‌లు, బంక కాయ‌లు, న‌క్కెర కాయ‌లు ఇలా వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం కార్డియా డైకోట‌మా. ఈ చెట్టు దాదాపు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు విశాలంగా కొమ్మలు అన్ని వైపులా వ్యాపించి ఉంటాయి. ఈ విరిగి చెట్టు మ‌న‌కు గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో విరివిరిగా క‌నిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయ‌లు కాస్తూ ఉంటాయి. ఈ కాయ‌లు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులో మాగిన త‌రువాత కొద్దిగా ఎరుపు రంగులో ఉంటాయి. వీటి కాయ‌ల లోప‌ల బంక లాగా కండ గ‌లిగిన ప‌దార్థం ఉంటుంది.

తియ్య‌టి రుచిని క‌లిగి ఉండే ఈ చెట్టు పండ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ పండ్లు అర‌గ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. క‌నుక వీటిని త‌క్కువ మోతాదులో రోజుకు 5 నుండి 10 పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. ఈ విరిగి చెట్టు ఔష‌ధ గుణాలను కూడా కలిగి ఉంటుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ చెట్టు ఆకులు, పండ్లు, బెర‌డు, గింజ‌లు అన్నీ కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిలో యాంటీ బ‌యాటిక్, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. విరిగి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాం. ఈ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. విరిగి పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా వ‌ర్షాకాలంలో ల‌భిస్తాయి. ఈ చెట్టు కాయ‌ల‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుంటారు. విరిగి పండ్లు మ‌న శ‌రీరానికి ఎంతో చ‌లువ చేస్తాయి.

Virigi Chettu Benefits in telugu do not leave this tree
Virigi Chettu Benefits

ర‌క్త దోషాలు కూడా తొల‌గిపోతాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. విరిగి చెట్టు ఆకుల‌ను కూడా కూర‌గా చేసుకుని తింటారు. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చెట్టు బెర‌డును ఎండ‌బెట్టి పొడిగా చేసి ఈ పొడికి త‌గిన‌న్ని నీళ్లు క‌లిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న చోట లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మైదా, శ‌న‌గ‌పిండితో ఈ పండ్ల‌ను క‌లిపి ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేస్తారు. ఈ చెట్టు బెర‌డుతో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో వ‌చ్చే రుతు సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

ఈ క‌షాయంతో గాయాల‌ను శుభ్రం చేసుకోవడం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. రోజుకు 5 నుండి 10 న‌క్కిరి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యంతో పాటు వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది. విరిగి చెట్టు బెర‌డుతో చేసిన‌ క‌షాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వ‌ల్ల దంతాలు గ‌ట్టి ప‌డ‌తాయి. ఈ చెట్టు ఆకుల‌ను మెత్త‌గా నూరి నుదుటి మీద రాయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ చెట్టు ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని తాగ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా విరిగి చెట్టులో ప్ర‌తి భాగం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts