దాదాపుగా చాలా మంది ఇండ్లలో బొప్పాయి చెట్లు ఉంటాయి. ఇవి తక్కువ ఎత్తు ఉన్నప్పటి నుంచే కాయలు కాస్తాయి. అయితే ప్రతి ఇంట్లోనూ బొప్పాయి చెట్టు కచ్చితంగా ఉండాలి. దీంతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే బొప్పాయి చెట్టును వెంటనే పెంచుతారు. అవేమిటంటే..
* బొప్పాయి పువ్వును తీసుకుని దంచి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పేను కొరికిన చోట రాయాలి. దీంతో అక్కడ వెంట్రుకలు పెరుగుతాయి.
* బొప్పాయి చెట్టు కాండానికి చిన్నగా గాటు పెడితే పాలు బయటకు వస్తాయి. వాటిని చర్మంపై రాస్తుంటే చర్మ సమస్యలైన గజ్జి, తామర తగ్గుతాయి.
* బొప్పాయి పాలను 10 చుక్కల మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా చక్కెర కలిపి 3 పూటలా తీసుకుంటుండాలి. గ్యాస్, అసిడిటీ, ఇతర సమస్యలు, మలబద్దకం తగ్గుతాయి.
* బొప్పాయి పాలను రోజూ ఒక సారి ఒక టీస్పూన్ మోతాదులో తాగుతుండాలి. దీంతో లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది.
* బొప్పాయి పచ్చికాయకు గాటు పెడితే దాంట్లో నుంచి పాలు వస్తాయి. వాటిని ఒక పాత్రలో సేకరించి ఆ పాత్రను బాగా కాల్చిన ఇసుకపై ఉంచాలి. దీంతో ఆ పాలు తెల్లని చూర్ణంలా మారుతాయి. ఈ చూర్ణాన్ని రోజుకు 2 సార్లు చిటికెడు మోతాదులో చక్కెర లేదా పాలతో తింటే అమితమైన జీర్ణశక్తి కలుగుతుంది.
* తేలు కుట్టిన చోట బొప్పాయి కాండం పాలు రాస్తే తేలు విషం హరించుకుపోతుంది.
* బాలింతలు బొప్పాయి పచ్చికాయను వండుకుని తింటుంటే వారిలో పాలు బాగా పడతాయి.
* బొప్పాయి ఆకును బాగా నూరి పేస్ట్‌లా చేసి కడితే బోదకాలు తగ్గిపోతుంది.
* ఉడుకుతున్న మాంసంలో బొప్పాయి కాయ ముక్కలను వేస్తే ఆ మాంసం త్వరగా ఉడకడమే కాదు, బాగా మెత్తగా కూడా మారుతుంది.