బయట ఏం ఖర్మ 10 సంవత్సరాల కింద వరకు వారుఅందరూ ఆరుబయట చెట్లల్లోకి, తుప్పల్లోకి, పొదల్లోకి, తుమ్మల్లోకి,కాలువ కట్ట,చెఱువుకట్టకు వెళ్లేవారు! ఒక గ్రామం అదే మన పల్లెటూరికి వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా భయంకరంగా అసహ్యం దర్శనం ఇచ్చిది, గ్రామంలో ఎవరో ఒకరిద్దరికి మరుగుదొడ్లు ఉండేవి రెండు మూడు కుటుంబాలు మినహాయిస్తే అందరూ ఆరుబయట చెంబు పట్టుకొని పోయేవారు,అది అసహ్యంగా భయానకంగా ఉండేది, నేల మొత్తం మలమూత్రాలు వ్యాపించి వుండేది, వర్షాలతో కలిసి ఆ మురుగు బావులలోకి వస్తూ ఉండేది. మరి ఇది మంచిదా? బాత్రూం బయట ఉంటే ఇంటికి ఒంటికి రెంటికి మంచిది కాదు.
బాత్రూం ఇంట్లో ఉంటే ఆరోగ్యం,భద్రత, దూరంగా ఉంటే అభద్రత, అసౌకర్యం. ఇకపోతే మన సాంప్రదాయం ప్రకారం బయట ఉండాలి సరే మరి అంత స్ధలం ఎక్కడుంది? అప్పట్లో సాధారణ జనం కాదుగానీ, ధనవంతులు ఉన్నత వర్గాల వారు చలా తక్కువ, 300- 500 గజాల స్థలంలో ఇల్లు వాకిళ్లు ఉండేవి, అప్పుడు బాత్రూం/ దొడ్లు బయటే ఉండేవి. మరి ఇప్పుడు భూమి బంగారం కంటే విలువైంది, ముఖ్యంగా అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత అటాచ్డ్ బాత్రూం అనివార్యం అయింది. ఎందుకంటే అపార్ట్మెంట్ అనేది ఎక్కువ జనం కోసం తక్కువ స్థలంలో నిర్మించేవి, ఒక అపార్ట్మెంట్ లోని ప్లాట్ ను 120 గజాల నుండి 220 గజాల వరకే ఉంటుంది.
ఇక ఓపెన్ ప్లాట్లో సాధారణంగా 100 గజాలు ఇల్లు కట్టడం అనేది గగనం. నూటికి 75% మంది 80 నుండి 100–120 గజాల మధ్యలోనే Independent House కడుతున్నారు, కట్టాలి అప్పుడు బయట ఎక్కడో బాత్రూం కట్టడానికి స్థలం ఉండదు. ఇకపోతే ఇంటి కాంపౌండ్ లోనే దూరంగా ఉన్న బాత్రూంకి మఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు,పెద్దవాళ్ళు అర్ధరాత్రి వెళ్లడం చాలా కష్టంతో కూడుకున్న పని. అప్పుడు ఇంట్లో మగవాళ్ళు తోడు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది, ఇక బాత్రూంలు మరుగుదొడ్లు లేని వాళ్ళ పరిస్థితి భయానకం, అది ఇప్పుడు ఊహించుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. పల్లెల్లో ఆడపడుచులకు ఇదొక భయంకరమైన అవమానకరమైన విషయం. సోషల్ వర్కర్లు డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రజలతో పోరాడి ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం అయ్యేలా చేశారు,
దీనివల్ల ముఖ్యంగా ఆడపడుచులకు ఆత్మగౌరవం దక్కింది. భారతదేశానికి పరిశుభ్రత విషయంలో చెడ్డపేరు ఆరుబయట మలవిసర్జన వల్లనే వచ్చింది,దీని వలన నీరు కలుషితమవడం,కలరా,అమిబియాసిస్ తరుచు వ్యాప్తిచెందేవి,పకృతి, పరిసరాలు భయాణకంగా వుండేవి. ప్రభుత్వాలు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి చేసింది. కేంద్రం ప్రతి కుటుంబానికి వక్తిగత మరుగుదొడ్లు స్కీమ్ ప్రవేశ పెట్టడం దేశంలోనే గొప్ప సంస్కరణగా చెప్పవచ్చు, దాని ఫలితాలు ఇప్పుడు మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం. అసౌకర్యంగా ఉన్నప్పుడు సాంప్రదాయాలు చేసేదేమీ లేదు, సాంప్రదాయమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది కాదు, ఎప్పుడైనా, ఎక్కడైనా సౌకర్యం మాత్రమే నిలబడుతుంది.
మొదటి ప్రాధాన్యత సౌకర్యం,భద్రత. ఇప్పుడు ఇంట్లో బాత్రూం ఉండడానికి కారణాలు, ముఖ్యంగా ఇంట్లో ఉండడం వల్ల,చికటి, ఎర్రటి ఎండకు, చలికి, వర్షానికి వెళ్ళకుండా రెండుఅడుగుల్లో బాత్రూంకు వెళ్ళవచ్చు. ఇంట్లో కాదు బెడ్రూంలో బాత్రూం అనేది ఒక గొప్ప విప్లవం Social revelation ఇది గొప్ప సౌకర్యం. ఇకపోతే బయట దొడ్లు ఉండటం ఆరుబయట వలన పురుగు పూసీ ఉంటుంది, తేళ్ళు,పాములులాంటి విష కీటకాలతో ప్రమాదం ఉంటుంది. అటువంటప్పుడు ఆరుబయట బాత్రూం అనేది భద్రత రిత్యా కూడా మంచిది కాదు. సాంప్రదాయాలు ఆయా కాలాల పరిస్థితులను బట్టి ఉంటాయి . అంతేతప్ప అవి ఆజ్ఞలు కావు, శిలా శాసనాలు అంతకంటే కావు. ఏ విషయంలోనైనా చివరికి అది మత సంబంధిత సంప్రదాయమైనప్పటికీ మనిషి సౌకర్యం మాత్రమే పాటిస్తాడు.