సాధారణంగా చాలా మంది వ్యాపార రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరికి వ్యాపార రంగంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, తీవ్ర నష్టాలు తలెత్తుతుంటాయి. ఈ విధంగా వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి ఏం చేయాలో దిక్కు తోచదు. ఇలాంటి క్రమంలోనే వాస్తు శాస్త్ర నిపుణులను కలిసి వారి ఇంటిలో ఏదైనా వాస్తు దోషం ఉందేమోనని కనుక్కొని అందుకు అనుగుణంగా మార్పులు చేస్తారు. ఇక వ్యాపార రంగంలో ఇబ్బందులు తలెత్తేవారు తప్పనిసరిగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
వ్యాపార రంగంలో ఏ విధమైనటువంటి నష్టాలు లేకుండా మంచి అభివృద్ధిలో కొనసాగాలంటే తప్పనిసరిగా కొన్ని సలహాలను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన సలహాలను పాటించడం ద్వారా వ్యాపారంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవు. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇంట్లో తప్పనిసరిగా ఈశాన్యం వైపు తెలుపు రంగులు వేయించుకోకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈశాన్యం వైపు తెలుపు రంగు వేయించుకోవడం వల్ల వ్యాపారంలో అనేక నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు కలుగుతాయి. కనుక ఈశాన్యం వైపు ఎలాంటి పరిస్థితులలో కూడా తెలుపు, సిల్వర్, గ్రే కలర్ వేయించుకోకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ఈ విధమైనటువంటి రంగులు ఈశాన్యంలో ఉంటే వెంటనే మార్పులు చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది.