వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఏం ఉండాలి అనేది మీరు చూసుకుని.. దానిని బట్టి ఫాలో అయ్యారంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా వంటింట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. వంటింట్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, లక్ష్మీదేవి మీ వెంట కొలువై ఉంటుంది. వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. ఎప్పుడూ కూడా విరిగిపోయిన సామాన్లని వంటింట్లో ఉంచకూడదు. విరిగిపోయిన సామాన్లు ఇంట్లో ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అది కుటుంబానికి అంత మంచిది కాదు కూడా. అలాగే చీపురు ఎప్పుడూ కూడా వంటింట్లో పెట్టకూడదు.
చీపురు వంటింట్లో ఉండటం వలన ఆర్థిక పరిస్థితి బాగుండదు. ఎప్పుడూ కూడా చీపురుని సరైన దిశలో సరైన విధంగా ఉంచితే మంచి జరుగుతుంది. నెగటివ్ ఎఫెక్ట్ పడదు. ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలను ఇంట్లో పెట్టకూడదు. ఇవి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. స్టీల్, చెక్క వంటి వాటిని పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ తప్పు కూడా చేయకుండా చూసుకోండి.
ఇంట్లో ఎప్పుడూ పూజ గది ఉండకుండా చూసుకోవాలి. వంటింట్లో ఎప్పుడూ కూడా తినేసిన సామాన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి, పూజ గది అక్కడ ఉండకుండా చూసుకోండి. పూజ గది ఎప్పుడు ప్రశాంతకరమైన చోటులో ఉండాలి. వీటితో పాటగా పూజ గదిలో అద్దం పెట్టకుండా చూసుకోండి. అద్దం పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మందులని కూడా పూజ గదిలో పెట్టకూడదు. వాస్తు ప్రకారం మందులని పూజగదిలో పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.