సృష్టిలో ఉన్న ఏ వ్యక్తి అయినా తనకు అంతా మంచే జరగాలని, జీవితంలో ముందుకు దూసుకెళ్లాలని, అన్నీ కలసి రావాలని ఆశిస్తాడు. ధనం కూడా బాగా సమకూరాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. అయితే కేవలం కొందరికి మాత్రమే అనుకున్నవి నెరవేరుతాయి. కొందరికి అలా జరగవు. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటే పాజిటివ్ ఎనర్జీ. అవును, మీరు విన్నది నిజమే. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే ఏ వ్యక్తి అయినా ఏం చేసినా కలసి రాదు. మరి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి..? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..! మీ ఇంట్లో పనిచేయని పాత గడియాలు (గోడకు పెట్టేవి, చేతికి పెట్టుకునేవి ఏవైనా సరే) ఉన్నాయా..? పగిలిపోయిన వాచ్‌లు కూడా ఉన్నాయా..? అయితే వెంటనే వాటిని తీసేయండి ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే వాస్తు దోషం కలుగుతుందట. అంతా నెగెటివ్ ఎనర్జీయే నిండిపోతుందట. కనుక వెంటనే వాటిని తీసేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అయి ఉండకూడదట. ఫర్నిచర్ అంతా మంచిగా ఉంటేనే అలాంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. దీంతో ఆ ఇంట్లో ఉండే వారి మధ్య బంధం మరింత బలపడుతుందట. విరిగిన ఇంటి తలుపులు, పెయింట్ ఊడిపోయిన తలుపులు, గోడలు వంటివి ఉండడం మంచిది కాదట. అలా ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహించదట. కనుక వెంటనే ఆయా రిపేర్లు చేయించుకోవడం ఉత్తమం. పగిలిపోయిన పింగాణీ, గాజు వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదట. దాంతో నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. అది మనకు అస్సలు మంచిది కాదట.
దేవుళ్లు, దేవతల విగ్రహాలు పగిలిపోయినవి ఇంట్లో ఉండకూడదట. అలా ఉంటే మనకు మంచి జరగదట. కనుక వాటిని వెంటనే తీసేయడం మంచిది. గోడలకు పెట్టే ఫొటో ఫ్రేంలు కూడా పగిలినవి ఉంచకూడదట. అలా ఉంటే ఇంట్లో అంతా నెగెటివ్ ఎనర్జీయే ఉంటుందట. పనిచేయని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులను కూడా ఇండ్లలో పెట్టుకోకూడదట. వాటితో నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుందట. ఇంక్ అయిపోయిన పెన్నులు, వాటి రీఫిల్స్, రాసి అరిగిపోయిన పెన్సిల్స్, షార్పెనర్స్, ఎరేజర్స్ వంటివి ఇంట్లో ఉంచుకోకూడదట. వాటి వల్ల కూడా మనకు అస్సలు మంచి జరగదట. కనుక వాటిని వెంటనే తీసేయాలి. పగిలిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచకూడదట. వాటితో ప్రతికూల శక్తులు ఇండ్లలోకి వస్తాయట. కనుక అలాంటి అద్దాలను కూడా ఇండ్లలో అస్సలు ఉంచుకోకూడదు.