Lending Money : కొంతమంది డబ్బులు లేనప్పుడు, అప్పు తీసుకుంటూ ఉంటారు. మనం కూడా, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే అప్పు ఇస్తూ ఉంటాం. అప్పు ఇచ్చేటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని తప్పులు చేయకూడదు. అప్పు ఇచ్చేటప్పుడు, వాస్తు ప్రకారం ఎటువంటి తప్పులను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం చూసినట్లయితే, ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు, దక్షిణం వైపు డబ్బు ఇవ్వకండి. లేదంటే డబ్బులు అసలు రావు. ఉత్తరం వైపు తిరిగి ఇస్తే, డబ్బులు మళ్ళీ మీరు పొందవచ్చు.
రుణం పై డబ్బు కొనుగోలు చేసేటప్పుడు, పశ్చిమం వైపు కొనకండి. అలానే, డబ్బులు ని లెక్కపెట్టేటప్పుడు, కొందరు నోటి తడి చేసి డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. కానీ, అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు సమస్య ఎదురవుతుంది. అప్పు తీసుకుని, బాధపడుతున్నట్లయితే, డబ్బులు ఇచ్చేటప్పుడు, ఉత్తరం దిశలో డబ్బులు ఇస్తే మంచిది. అప్పు ఇచ్చేటప్పుడు, ఎడమ చేతితో డబ్బులు ఇవ్వండి. కొంతమంది రుణగ్రహతలు, డబ్బులు తీర్చలేక బాధపడుతూ ఉంటారు.
రుణ సమస్యతో బాధపడే వాళ్ళు, మంగళవారం నాడు రుణ మొత్తాన్ని చెల్లించండి. ఇది మీ రుణాన్ని వేగంగా తగ్గిస్తుంది. ఇలా కనుక మీరు పాటించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు.
ఆ సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే, వీటిని పాటించడం మంచిది. అప్పుడు ఈ సమస్య నుండి సులభంగా గట్టెక్కొచ్చు. సంతోషంగా ఉండొచ్చు. అలానే, లక్ష్మీదేవి కూడా నిత్యం మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ కూడా కలగకుండా, సంతోషంగా జీవించడానికి అవుతుంది. కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లు, ఖచ్చితంగా వీటిని పాటించండి అప్పుడు సమస్య అంతా కూడా పోతుంది.