vastu

ఇంటి ఈశాన్యంలో ఈ పూల మొక్కలను పెంచితే.. సంపద పెరుగుతుంది..!

సాధారణంగా మన ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే చాలా మంది ఎక్కువగా పూల మొక్కలను పెంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ పూల మొక్కలను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం నాటితే ఎంతో అదృష్టమని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు మన ఇంటి ఆవరణలో ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మన ఇంటి ఆవరణంలో ఈశాన్య దిశ వైపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూల మొక్కల్లో గోవర్థనం వంటివి పెట్టుకోవాలి. అదేవిధంగా సన్నజాజి, మల్లె పూవు, జాజి పూల చెట్లను పెట్టుకోవాలి. ఈ మొక్కలకు పూసిన పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా ప్రతి రోజూ ఉదయం లేవగానే ఉత్తరదిశలో నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ఒక పచ్చని మొక్కను చూడటం వల్ల ఎంతో శుభ ఫలితాలను ఇస్తాయి.

grow these plants in north east corner for wealth

ఇలా ఇంటి ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలతోపాటు రామ తులసి, కృష్ణ తులసి మొక్కలను పెట్టి పూజ చేయటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. వీటితోపాటు మనీప్లాంట్, మోదుగ చెట్టును ఆధ్యాత్మిక పరంగా ఎంతో శుభకరమైన వృక్షాలుగా భావిస్తారు. అయితే ఇంటి ఆవరణలో ఎల్లప్పుడూ బ్రహ్మజెముడు, పాలుగారే చెట్లను పెంచుకోకూడదు. ఇక కలబంద ఇంటి ఆవరణంలో దక్షిణ దిశ వైపు ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts