vastu

Vastu Tips : ఇలా చేశారంటే ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తి ఏర్ప‌డుతుంది.. క‌ష్టాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Vastu Tips : ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం మనం అనుసరించామంటే, క‌చ్చితంగా సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, ఆ ఇంట పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో సమస్యలు అన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం ఉండాలన్నా, ధనం ఉండాలన్నా, ఆనందం ఉండాలన్నా అన్నింటికీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది అవసరం. ప్రతికూల శక్తి లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఉండేట్లు మనం చూసుకున్నట్లయితే.. కచ్చితంగా ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా జీవించడానికి అవుతుంది. అయితే కచ్చితంగా అందరూ ఇళ్లల్లో ఈ వాస్తు చిట్కాల‌ని పాటించాలి.

వీటిని కనుక పాటిస్తే ఇబ్బందుల నుండి బయట ప‌డ‌వ‌చ్చు. మరి కచ్చితంగా పాటించాల్సిన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మందులకి సంబంధించి వ్యర్థాలను ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోకండి. ఇటువంటివి ఇంట్లో పెట్టడం వలన ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అనేక రకాల సమస్యలు కలుగుతాయి. అదే విధంగా ఇంట్లో చీకటి ఉన్నప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఏర్ప‌డుతుంది. కాబట్టి సంధ్య వేళలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం.

if you do this your home will get negative energyif you do this your home will get negative energy

నిద్రపోయేటప్పుడు మీరు ఆ దీపాలు అన్నింటినీ కూడా ఆర్పేయవచ్చు. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ముఖ్యం. ఎప్పుడూ కూడా ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఎటువంటి వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలి. చెత్తాచెదారం ఉంటే దారిద్య్రానికి స్వాగతం పలికినట్లే. పగిలిపోయిన విగ్రహాల వంటివి ఇంట్లో ఉంచకూడదు.

పగిలిపోయినవి, పాత దేవుడి విగ్రహాలని ఇంట్లో పెట్టడం వలన అశుభం కలిగిస్తుంది. అక్కడ ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. దురదృష్టం కలుగుతుంది. టెన్షన్ గా ఉండడం నెగెటివ్ గా ఆలోచించడం వంటివి మంచిది కాదు. మునిగిపోతున్న పడవలు, భయంకరమైన పెయింటింగ్‌లు వంటివి కూడా ఇంట్లో ఉంచుకోకండి. ఇవి కూడా ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి.

Admin

Recent Posts