Buddha Idol : ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ ఇల్లు ని అందంగా ఉంచుకోవాలని, అందంగా అలంకరిస్తూ ఉంటారు. చాలామంది, ఇళ్లల్లో అలంకరణ కోసం బుద్ధుడు విగ్రహాలని పెడుతుంటారు. అలానే, కొంతమంది ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే, బుద్ధుడు విగ్రహాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. బుద్ధ విగ్రహాన్ని ఇష్టం నచ్చిన చోట పెట్టకూడదని, పండితులు చెప్పడం జరిగింది. బుధుడు శాంతికి చిహ్నం. బుద్ధుని విగ్రహం ఇంట్లో ఉంటే, శ్రేయస్సు, సామరస్యం వస్తుంది. బుద్ధుని విగ్రహం ద్వారా ప్రయోజనాన్ని పొందాలంటే, కచ్చితంగా వాస్తు ప్రకారం పాటించాలి.
వాస్తు ప్రకారం, ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని ఎటువైపు పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. స్టడీ రూమ్ లో, బుద్ధుడు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. దీనివలన చదువుపై శ్రద్ధ పెట్టడానికి అవుతుంది. దృష్టిని కూడా మార్చుకోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే, పనిచేసే డెస్క్ దగ్గర బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. యోగా చేసేటప్పుడు కూడా, బుద్ధుడి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని వలన సానుకూల శక్తి వస్తుంది.
బుద్ధుడి విగ్రహాన్ని కారులో పెట్టుకుంటే కూడా మంచిదే. బుద్ధుడి విగ్రహాన్ని, ఇంటి గార్డెన్లో పెట్టుకుంటే, ఐశ్వర్యం కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా, ఇంట్లో మీరు ఈ చోట్ల బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. నేలమీద బుద్ధుడు విగ్రహాన్ని పెట్టకూడదు.
షూ రాక్ కింద లేదంటే మీద పెట్టకండి. ఇలా చేస్తే, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. బుద్ధుడు విగ్రహాన్ని పెట్టేటప్పుడు, కింద ఎర్రటి కాగితాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఉంచాలి. ఇలా చేయడం వలన దురదృష్టం తొలగిపోతుంది. అదృష్టం వస్తుంది. బుద్ధుడి విగ్రహాన్ని లాకర్ లో ఉంచకూడదు. లాకర్ లో బుద్ధుడు విగ్రహాన్ని పెడితే, ఆర్థిక సమస్యలు వస్తాయి. బుద్ధుని విగ్రహాన్ని ఏదైనా షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు.