Flowers For Vastu : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అయితే, ఇంట్లో ఈ మొక్కలని కనుక పెంచుకున్నట్లయితే, వాస్తు దోషం తొలగిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. చాలామంది, ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. ఇల్లు చూడడానికి అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మొక్కలు ఉంటే, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే, ఇంట్లో మొక్కలని పెంచుకునేటప్పుడు, ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే, వాసుదోషం తొలగిపోతుంది.
ఇంట్లో మల్లె మొక్క పెంచడం మంచిది. ఇంట్లో మల్లె మొక్క ఉండడం వలన, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దంపతులు మధ్య సానిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గుతాయి. మల్లె మొక్క ఇంట్లో ఉంటే, కోపం కూడా తగ్గుతుంది. అలానే, సంపంగి మొక్క కూడా ఇంట్లో ఉండొచ్చు. సంపంగి పువ్వుల్ని పూజలో ఉపయోగిస్తే మంచిది. సంపంగి పువ్వు వాసన చాలా బాగుంటుంది. మైండ్ ని రిఫ్రెష్ గా ఉంచుతుంది. పైగా, సంపంగి పూల మొక్క ఇంట్లో ఉంటే, నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది.
అలానే, గులాబీ మొక్క ఇంట్లో ఉంటే కూడా మంచిది. గులాబీ పూలు చూడడానికి అందంగా ఉంటాయి. పైగా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. పారిజాతం ఇంట్లో ఉంటే చాలా మంచిది. పారిజాతాన్ని పెంచుకుంటే, కుటుంబ సభ్యులు మధ్య సమస్యలు తొలగిపోతాయి. కలహాలు ఉండవు.
పారిజాతం మొక్క ఇంట్లో ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. పారిజాతం మొక్క ఇంట్లో ఉండడం వలన, వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి. పాలసముద్రం నుండి బయటకి వచ్చిన పవిత్రమైన వాటిలో పారిజాతం ఒకటి. ఇంద్రుడు ఈ చెట్టుని స్వర్గం నుండి తీసుకువచ్చాడని అంటుంటారు. ఇలా, ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఎంతో మంచి జరుగుతుంది, వాస్తు దోషాలు ని కూడా తొలగించుకోవచ్చు.