vastu

M Letter : మీ అర‌చేతిలో ఆంగ్ల అక్ష‌రం ఎమ్ (M) వ‌చ్చేలా ఆకారం ఉందా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

M Letter : జ్యోతిష్య శాస్త్రం, న్యూమ‌రాల‌జీలాగే హ‌స్త సాముద్రికం కూడా ఒక‌టి. అర చేతిలో ఉండే రేఖ‌ల‌ను బ‌ట్టి కొంద‌రు జాత‌కాలు చెబుతుంటారు. అయితే కొంద‌రి అర చేతుల్లో కొన్ని ర‌కాల రేఖ‌లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఇలాంటి ఒకే విధ‌మైన రేఖ‌ల‌ను క‌లిగి ఉన్న‌వారిని ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తులుగా హస్త సాముద్రికం చెబుతుంటుంది.

అయితే అర‌చేతిలో ఆంగ్ల అక్ష‌రం ఎమ్ (M) ఆకారంలో రేఖ‌లు చాలా కొద్దిమందికే ఉంటాయి. ఇలాంటి వారిని కూడా హ‌స్త సాముద్రికం ప్ర‌త్యేకమ‌ని చెబుతోంది. అయితే ఈ విధంగా అర‌చేతిలో ఆంగ్ల అక్ష‌రం M ఆకారంలో రేఖ‌లు ఎవ‌రికైనా ఉంటే.. వారి జీవితంలో ఏం జ‌రుగుతుందో.. వారు ఎలాంటి వారు అవుతారో.. ఇప్పుడు తెలుసుకుందాం.

m letter in hand what happens do you know

అర‌చేతిలో ఆంగ్ల అక్ష‌రం M ఆకారం ఉంటే వారు అత్యంత అదృష్ట‌వంతులు అవుతార‌ని హ‌స్త సాముద్రికం చెబుతోంది. వారు ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంద‌ట‌. వారు అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌ను క‌లిగి ఉంటార‌ట. ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ట‌.

అయితే కుడిచేతి వాటం ఉన్న‌వారికి ఎడ‌మ చేతిలో, ఎడ‌మ చేతి వాటం ఉన్న‌వారికి కుడి చేతిలో అలా ఆంగ్ల అక్ష‌రం M ఉండాల‌ట‌. అప్పుడే పైన చెప్పిన విధంగా జ‌రుగ‌తుంద‌ట‌.

Admin

Recent Posts