వాస్తు.. పట్టించుకునే వారికి ప్రతి అడుగు సెంటిమెంటే పట్టించుకోనివారికి ఏం జరిగినా ప్రయత్నలోపమే. నమ్మకం లేనివారి సంగతి సరే.. మరి వాస్తును పరిగణలోకి తీసుకునేవారి పరిస్థితి ఏంటి? గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంట్లో సమస్యలు చుట్టుముడుతున్నాయ్, మనశ్శాంతి అనే మాటే లేదు, కష్టపడి భారీగా సంపాదించినా కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండడం లేదు.. అవసరానికి ఎవ్వరి నుంచి సహాయం కూడా అందడం లేదు..ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తోంది..ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో సమస్య. దీనికి కారణం వాస్తు లోపాలే అంటారు వాస్తు నిపుణులు.. సాధారణంగా ఇల్లు నిర్మించుకునేటప్పుడు అన్నీ వాస్తుప్రకారం చూసుకుంటారు.. వాస్తు నియమాలు అనుసరిస్తూ వంటగది నుంచి పడకగది వరకూ అన్నీ అరెంజ్ చేస్తారు. మంచి ముహూర్తం చూసిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. ఇంకా ఏమూలో మిగిలిపోయిన వాస్తు దోషాల నుంచి ఉపశమనం కోసం వాస్తు మండపం, నవగ్రహాల హోమం నిర్వహిస్తారు.
వాస్తు నియమాలు, పూజలు, హోమాలు అన్నీ బాగానే ఉన్నాయ్..అయినా ఇంట్లో ప్రశాంతత లోపించిందా? అయితే భారీ భారీ మార్పులొద్దు, ఎక్కువ ఖర్చులు చేయొద్దు..కేవలం మీ ఇంటి అలంకరణలో ఈ 6 పెయింటింగ్స్ పెట్టుకోండి చాలు..చాలా వాస్తు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అంటారు వాస్తు నిపుణులు… ఇంటి నిర్మాణంలోనే కాదు అలంకరణలోనూ వాస్తు సూత్రాలు పాటిస్తే ఆ ఇంట్లో ఉండే ప్రతికూలశక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలంకరణలో భాగంగా గోడకు పెట్టే పెయింటింగ్స్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయంటారు. గుర్రాల పెయిటింగ్ ని చాలామంది ఇష్టపడతారు..పరిగెత్తే గుర్రాలున్న పెయిటింగ్ ని ఇంట్లో దక్షిణ దిశగా పెడితే మీ కెరీర్ జోరందుకుంటుంది. అన్నింటా విజయం సాధిస్తారు.
నెమలిని చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. సృష్టిలో సంభోంగించకుండా జన్మనిచ్చేది నెమలి మాత్రమే. పురివిప్పిన నెమలి పెయిటింగ్ ఇంట్లో దక్షిణ దిశలో ఉంచితే ఆదాయం పెరుగుతుంది. అన్నింటా అదృష్టం కలిసొస్తుంది. కమలాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. స్వచ్ఛతకు, సమృద్ధికి చిహ్నం అయిన కమలం పెయింటింగ్ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి ఇట్టే మాయమైపోతుందట. దీనిని తూర్పు దిశలో ఉంచాలి. ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని ఉండే బుద్ధుడిని చూడగానే మనసులో అలజడి మాయమైపోతుందటారు. అందుకే చాలామంది బుద్ధుడి విగ్రహం కానీ , పెయిటింగ్ కానీ తీసుకొచ్చి పెట్టుకుంటారు. దీనిని కూడా ఇంట్లో తూర్పు దిశగా కానీ ఈశాన్యం వైపు కానీ ఉంచడం మంచిది.
జారే జలపాతం అలజడి నిండిన మనసుకి ఆహ్లాదాన్ని అందిస్తుంది. జారే జలపాతాన్ని చూస్తూ గంటలు గడిచిపోతాయి. ఇలాంటి పెయింటింగ్ ఇంట్లో ఉండడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి కొత్త ఎనర్జీ వస్తుంది. ఈ పెయింటింగ్ ని నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెడితే ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుందంటారు వాస్తు పండితులు. కొండలు..ఎన్ని కష్టాలున్నా అడుగు ముందుకు పడితేనే శిఖరాన్ని చేరుకుంటాం అనేందుకు సూచన. పైకి చేరుకునేందుకు వేసే ప్రతి అడుగు కష్టంగా ఉంటుంది కానీ శిఖరాన్ని చేరుకున్న తర్వాత పొందే ఆనందం వేరు. అక్కడివరకూ వెళ్లాలంటే కష్టాలనే కొండను ఎక్కి తీరాలి. ఈ పెయింటింగ్ ని సౌత్ వెస్ట్ గోడకి తగిలించండి….కెరీర్లో వృద్ధి చెందుతారు.