Phoenix Photo : ఇంట్లో ఈ ప‌క్షి ఫొటో లేదా విగ్ర‌హాన్ని పెట్టుకోండి.. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది..!

Phoenix Photo : వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ప‌క్షుల‌ను పెంచ‌డం లేదా ప‌క్షి చిత్రాల‌ను పెట్టుకోవ‌డం శుభాల‌ను క‌లిగిస్తుంది. ఇంట్లో ఉన్న వారికి ఉండే స‌మ‌స్య‌లు పోతాయి. ఆరోగ్యం క‌లుగుతుంది. అయితే వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఫీనిక్స్ ప‌క్షి చిత్రాన్ని లేదా విగ్ర‌హాన్ని ఉంచ‌డం ఇంకా మంచిది.

గ్రీకు పురాణాల ప్ర‌కారం ఫీనిక్స్ ప‌క్షిని విజ‌యానికి, శ‌క్తికి, కీర్తికి ప్ర‌తీక‌గా భావిస్తారు. అందువ‌ల్ల ఈ ప‌క్షి విగ్ర‌హం లేదా చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ద‌క్షిణం వైపున ఈ ప‌క్షి చిత్రం లేదా విగ్ర‌హాన్ని పెట్ట‌డం వ‌ల్ల శుభాలు కలుగుతాయి.

put this bird photo in your home for luck and wealth

ఫీనిక్స్ ప‌క్షి చిత్రాలు లేదా విగ్ర‌హాల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్ల విజ‌య‌మార్గంలో ఉండే ఆటంకులు తొల‌గిపోతాయి. చేప‌ట్టిన ప‌నులు పూర్త‌వుతాయి. విజ‌యాలు సాధిస్తారు. త్వ‌ర‌గా వృద్ధి చెందుతారు. ఆయురారోగ్యాలు, ఐశ్వ‌ర్యం క‌లుగుతుంది. ఉత్సాహంగా జీవిస్తారు.