Money Problems : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ఎంతగానో కష్టపడుతుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే, ఖచ్చితంగా అర్థిక ఇబ్బందులు ఉండవు. అయితే, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాస్తు దోషాలు ఉన్న, ఏ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. వాస్తు ప్రకారం, లక్ష్మీదేవి ఒకరి ఇంట్లో స్థిరపడినట్లయితే, ఇంట్లో సంపద శాశ్వతంగా ఉండాలంటే, కొన్ని పనులు చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమై, ఇంట్లో డబ్బు సమస్యల్ని దూరం చేస్తుంది. వాస్తు ప్రకారం డబ్బు సమస్యల నుండి బయటపడడానికి, సంపద పెంచుకోవడానికి వీటిని ఆచరించడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్ర లేచాక కిటికీలు, తలుపులు తెరవాలి.
ఇలా చేయడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. అలానే, వాస్తు ప్రకారం చీపురులో లక్ష్మీదేవి ఉంటుంది. చీపురు సరైన దిశలో పెట్టాలి, చీపురు ఇంటికి వచ్చే వాళ్ళ కళ్ళకి కనపడకుండా ఉంచాలి. అలా కాకుండా, చీపురుని బయట ఉంచితే ఇబ్బంది పడాలి. అలానే, వాస్తు ప్రకారం లక్ష్మీదేవి శుభ్రమైన చోట ఉంటుంది. కాబట్టి, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడాలని మీరు కోరుకుంటున్నట్లయితే, ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇలా చేస్తే, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. అలానే, వాస్తు ప్రకారం అన్నపూర్ణ దేవిని రోజు పూజించాలి. ఒక గిన్నెలో బియ్యం ఉంచి, దానిపైన అన్నపూర్ణ విగ్రహాన్ని ఉంచాలి. ఇలా చేస్తే, ఇంట్లో అన్నానికి, ధనానికి లోటు ఉండదు. వాస్తు ప్రకారం ఇంటి తలుపు వద్ద స్వస్తిక్ చిహ్నం ఉంచాలి.
ఇలా చేస్తే, సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ప్రతి ఉదయం ఇంటి తలుపు తెరిచేటప్పుడు, ముందుగా వీటిని పూజించాలి. అలా చేస్తే, సుఖ సంతోషాలు కలుగుతాయి. చూసారు కదా పండితులు చెప్పిన విషయాలని, ఇంట్లో డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఇలా చేయండి. ఆ బాధలు ఉండవు.