vastu

Negative Energy : ఆర్థిక స‌మ‌స్య‌లు, అప్పులు, క‌ల‌హాలు ఉంటున్నాయా..? నెగెటివ్ ఎన‌ర్జీని ఇలా త‌రిమేస్తే చాలు..!

Negative Energy : ప్రతి ఒక్కరు కూడా, మంచి జరగాలని నెగటివ్ ఎనర్జీకి దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ కనుక, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వున్నా, ఇబ్బందులు వున్నా, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడం ఇలా ఏవేవో సమస్యలు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ని తరిమి కొట్టి, పాజిటివ్ ఎనర్జీ ని ఇంట్లోకి తీసుకురావాలంటే, ఇలా చేయడం మంచిది. ఇంట్లో విండ్ చైన్స్ ని వేలాడకడితే మంచిది. గాలికి అవి కదిలినప్పుడు, శబ్ద తరంగాలు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తాయి. ఇంటి మూలలలో ఉప్పు చల్లితే, ఇంట్లో దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి.

చిటికెడు ఉప్పు తీసుకొని ఇంటి ద్వారం వద్ద ఒక గుడ్డలో కట్టిపెట్టి లేదంటే డోర్ మేట్ కింద పెడితే, దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఉంటాయి. అలానే, ఇంట్లో మంచి జరగాలన్నా, పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా సరైన వెల్తురు ఉండేటట్టు చూసుకోండి. ఇంట్లోకి వెల్తురు వచ్చే విధంగా కర్టైన్స్ ని పెట్టండి. ఏ గదిలో అయితే గాలి. వెల్తురు ఎక్కువగా ఉంటుందో, ఆ గదిలో దుష్టశక్తులు ఉండవు. ఎప్పటికప్పుడు, ఇంట్లో ఫర్నిచర్ ని కూడా సర్దుకుంటూ ఉండాలి. హోమ్ ఇంటీరియర్స్ ఎప్పుడూ కూడా, ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.

remove negative energy from your home like this

విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. పాడైపోయిన పాత సామాన్లు తొలగించుకోవాలి. బయట నుండి గాలి, వెలుతురు వచ్చే విధంగా వెంటిలేషన్ ఉండాల్సిందే. ఏ గదిలో కూడా చీకటి లేకుండా చూసుకోవాలి. వాటి ద్వారా, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో అగర్బత్తులని వెలిగించడం వలన మంచి సువాసన మాత్రమే కాదు.

ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తాయి. ఇంటిని సర్దేటప్పుడు బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా తీసేస్తూ ఉండండి. వీటి వలన నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసారు కదా, ఎటువంటి వాస్తు చిట్కాలు అని పాటిస్తే మంచి జరుగుతుందని మరి ఈసారి తప్పులు చేయకుండా చూసుకోండి. అప్పుడు అంతా మంచి జరుగుతుంది.

Admin

Recent Posts