Vastu Tips : కొత్తగా ఇల్లు కట్టుకునేవారు లేదా ఇప్పటికే ఇళ్లలో ఉంటున్నవారు చాలా మంది ప్రస్తుతం వాస్తు చిట్కాలను పాటిస్తున్నారు. ఏమైనా సమస్యలు వస్తున్నాయంటే అందుకు ముందుగా వాస్తుదోషం ఏదైనా ఉందేమోనని పరిశీలిస్తున్నారు. దీంతో ఆ దోషాలను పోగొట్టుకునే మార్గాలను అనుసరిస్తున్నారు. ఇక కొందరు వాస్తు దోషాలను పోగొట్టుకోవాలని చెప్పి రకరకాల ఫొటోలను, పెయింటింగ్లను ఇంట్లో పెడుతుంటారు. అయితే ఏ ఫొటో పెట్టాలి.. దేన్ని పెట్టుకోవద్దు.. అన్న విషయాలను తెలుసుకుని ఆ తరువాతే వాటిని పెట్టుకోవాలి. లేదంటే పాజిటివ్ ప్రభావానికి బదులుగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. దీంతో సమస్యలు తగ్గకపోగా.. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఇక చాలా మంది ఇళ్లలో పులి బొమ్మలను లేదా పులి ఫొటోలు, పెయింటింగ్లను పెట్టుకుంటుంటారు. కానీ వాస్తు ప్రకారం వీటిని పెట్టుకోకూడదు. ఇది క్రూరమృగం. అందువల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. కాబట్టి ఇంట్లో లేదా కార్లలో ఎట్టి పరిస్థితిలోనూ పులి బొమ్మలు, ఫొటోలను పెట్టకూడదు. లేదంటే వాస్తు దోషం ఏర్పడి సమస్యలు వస్తాయి. ఇక ఇదే కాకుండా ఇంట్లో పెట్టుకోకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
యుద్ధాలకు సంబంధించిన ఫొటోలను లేదా పెయింటింగ్స్, ముళ్లు కలిగి ఉండే బ్రహ్మజెముడు లేదా నాగజెముడు చెట్లను, పండ్లు, పూలు లేని చెట్లకు చెందిన ఫొటోలు, మునిగిపోతున్న పడవ ఉన్న పెయింటింగ్లు, నగ్న చిత్రాలు, బొమ్మలు, కత్తులతో యుద్ధం చేస్తున్నట్లు ఉండే ఫొటోలు, బొమ్మలు, వేటాడేవి, బంధించబడిన ఏనుగులకు చెందిన ఫొటోలు, విచారంతో కూడిన పెయింటింగ్స్ వంటి వాటిని ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో పెట్టరాదు. పెడితే నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోయి వాస్తు దోషాలు ఏర్పడుతాయి. అప్పుడు ఇంట్లోని వారికి అన్నీ సమస్యలే వస్తాయి. కనుక వాటిని ఇంట్లో పెట్టుకునే వారు ఒకసారి ముందుగానే పరిశీలించి సరైన విషయాలను తెలుసుకుని మరీ పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.