చాలా మంది పడకగదిలో అద్భుతమైన సీనరీలను అలంకరిస్తారు. కంటికి ఇంపైన పెయింటింగులు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలా అని ఏవి పడితే అవి గోడలకు తగిలించకూడదు. గదిలోకి అడుగు పెట్టినప్పుడు మన చూపు వాటిమీద పడుతుంది. పెయింటిగ్స్ కానీ, సీనరి కానీ మన మనసుని ప్రభావితం చేస్తాయి అని మనశాస్త్ర నిపుణులు అంటున్నారు.
అంతే కాకుండా కొన్నిటిని బెడ్ రూమ్ లో ఉంచడం వల్ల వాస్తు రీత్యా మంచి ఫలితాలు పొందవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒకటి నెమలి పించం అవును బెడ్ రూమ్ గోడకు నెమలి పించం పెట్టడం వాస్తు రీత్యా మంచి ఫలితాలు పొందవచ్చు అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. బెడ్‌రూమ్‌లో నెమలి పింఛాన్ని కనబడేటట్లు పెట్టి ఉదయం నిద్ర లేవగానే దానిని చూడడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయంటున్నారు.
రాహుగహ్ర దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటు న్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.